Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ ఆఫీసర్ సస్పెన్సుగా 'రక్షక భటుడు'

నందు, రిచా పనాయ్, 'బాహుబలి' ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజీ, ధన్‌రాజ్, ముఖ్యతారలుగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం‌లో సుఖీభవ మూవీస్ పతాకంఫై గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'రక్షక భటుడు'. ఇప్పటిక

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (16:04 IST)
నందు, రిచా పనాయ్, 'బాహుబలి' ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజీ, ధన్‌రాజ్, ముఖ్యతారలుగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం‌లో సుఖీభవ మూవీస్ పతాకంఫై గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'రక్షక భటుడు'. ఇప్పటికి 60  శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భం‌గా దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ... "క్రేజీ కథాంశంతో క్రేజీ క్రేజీగా ఈ సినిమా రూపొందుతోంది. నేను ఇంతకుముందు డైరెక్ట్ చేసిన 'రక్ష', 'జక్కన్న' చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ కథాంశం ఉంటుంది. ఇందులో ఓ స్పెషల్ స్టార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. 
 
ఆంజనేయస్వామి ముఖంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరో చెప్పమంటూ చాలా మంది క్యూరియాసిటీ ప్రదర్శించారు. ఆ పాత్రను పోషించిన స్పెషల్ స్టార్‌ను సినిమా రిలీజ్ వరకూ సస్పెన్సుగా ఉంచదలిచాం" అని తెలిపారు. నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ. "ఈ సబ్జెక్ట్ వినగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. వెంటనే ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాను. ఇండస్ట్రీలోని ముఖ్య తారలంతా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి ప్రథమార్ధంలో జరిపిన షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్స్ చిత్రీకరించాము. ఫిబ్రవరిలో జరిపే షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది." అని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments