Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ సావంత్ కు స‌ల్మాన్‌, సోహైల్ అండ‌!

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (16:53 IST)
Rakhi, Salman, Jaya
బాలీవుడ్ న‌టి రాఖీ సావ‌త్‌కు కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌, అత‌ని సోద‌రుడు సోహైల్ అండ‌గా వుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. రాఖీ త‌ల్లి జ‌యా సావంత్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఓ ఆసుప‌త్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. అందుకు ల‌క్ష‌ల్లో ఖ‌ర్చ‌వుతుంది. అందుకు బిగ్‌బాస్ 14 గ్రాండ్ ఫినాలేలో టాప్ 5 వ‌ర‌కు వెళ్లిన రాఖీ, త‌న త‌ల్లి కోస‌మే 14 ల‌క్షలు తీసుకొని బ‌యట‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు ఆసుప్ర‌తిలో ట్రీట్‌మెంట్ సంద‌ర్భంగా అన్ని వివ‌రాలు తెలుసుకున్న సోహైల్ ఓ వీడియోను విడుద‌ల చేశాడు. రాఖీ..నీకు గానీ, మీ త‌ల్లికిగానీ ఏదైనా అవ‌స‌రం అయితే వెంట‌నే నాకు ఫోన్ చేయి. మీ అమ్మ గారిని నేనెప్పుడు క‌ల‌వ‌లేదు. కానీ నువ్వు నాకు తెలుసు. నువ్వే ఇంత స్ట్రాంగ్ వుంటే, మీ అమ్మ గారు ఇంకా స్ట్రాంగ్‌గా ఉండి ఉంటారో. మీ అమ్మ గారు త్వ‌ర‌గా కోలుకుంటార‌ని ఆశిస్తున్నా. నిన్ను త్వ‌ర‌లోనే క‌లుస్తా. మీ అమ్మ గారు కోలుకున్నాక ఆమెను క‌లుస్తా. ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ అని సొహైల్ అన్నారు.
 
దీనికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ రాఖీసావంత్ త‌న త‌ల్లిచేత వీడియో చేసింది. స‌ల్మాన్‌జీ, థ్యాంక్‌యు బేటా, సోహిల్ జీ థ్యాంక్‌యూ. ఇప్పుడు కీమో జ‌రుగుతుంది. నేను ఆసుప్ర‌తిలో వున్నా.ఇంకా రెండుసార్లు జ‌రిగాక త‌ర్వాత ఆప‌రేష‌న్ చేస్తారు. ఆప్‌కో ప‌ర‌మేశ్వ‌ర్ ఖుద్ ఆగేబ‌డాయే, ఆప్‌కేసాత్ ప‌ర‌మేశ్వ‌ర్ హై, థ్యాంక్‌యూ.. అలోలోయా.. అంటూ వీడియోలో పేర్కొంది. ఇదిలా వుండ‌గా, త‌న త‌ల్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్న ఫొటోల‌ను రాఖీ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప‌లువురు స్పందిస్తున్నారు. ఆర్థికంగా సాయం చేసేందుకు ప‌లువురు సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments