రాఖీ సావంత్ తల్లి కాబోతోందా... సల్మాన్ ప్రమేయం ఏంటి.. ? ఆమె అరెస్ట్ అయ్యిందా?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (16:51 IST)
బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్‌ తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై రాఖీ సావంత్ మాత్రం నోరెత్తట్లేదట. కానీ రాఖీ గర్భం దాల్చిన మాట వాస్తవమేనట. బిగ్‌బాస్‌ మరాఠీ షోలో ఈ విషయాన్ని రాఖీ వెల్లడించినట్లు తెలుస్తోంది. కానీ ఎవరూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఆ సంతోషం తనకు ఎంతోకాలం నిలవలేదు. తనకు గర్భస్రావం అవడంతో తీవ్ర మనోవేదనకు గురైందని తెలుస్తోంది. 
 
గతేడాది జూలైలోనే తమ వివాహం జరిగిందని.. కానీ తన భర్త అదిల్‌కు తమ పెళ్లి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఇష్టం లేదు. అందుకే ఇద్దం కామ్ గా వుండిపోయాం. తనను పెళ్లి చేసుకున్నానని అందరికీ తెలిస్తే తన చెల్లికి పెళ్లవుతుందో లేదని భయపడ్డాడు. కానీ సల్మాన్‌ భాయ్‌ అతడికి నచ్చజెప్పడంతో చివరకు పెళ్లి జరిగిందని అంగీకరించినట్లు రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.
 
మరోవైపు తన వీడియో లింక్‌లు, ఫోటోలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా ఫిర్యాదు ఆధారంగా రాఖీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ముంబై పోలీసులు గురువారం నటి రాఖీ సావంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు.
 
నటి ఫిర్యాదు మేరకు, ముంబైలోని అంబోలి పోలీసులు రాఖీ సావంత్‌పై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 354A  కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అంబోలి పోలీసు బృందం గురువారం సావంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments