నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

దేవీ
బుధవారం, 26 నవంబరు 2025 (18:09 IST)
Sri Vishnu, Akhil Raj, Tejaswini, Sailu Kampati, Bobby
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
 
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ - ఒక సినిమాతో ఇలా టీమ్ అంతా ఎమోషనల్ గా కనెక్ట్ కావడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అరగంట కదా అని ఈ ఈవెంట్ కు వచ్చాను కానీ వీళ్లందరి చూస్తుంటే నేను వెళ్లాల్సిన ఫ్యామిలీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నా. వేణు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనను చూస్తుంటే నాకూ ప్రొడ్యూసర్ కావాలని ఉంది. డైరెక్టర్ సాయిలు అమీర్ పేట ఛాలెంజ్ చేసినప్పుడు ఒక సాటి డైరెక్టర్ గా భయమేసింది. కానీ ఈ రోజు సాయిలు బాక్సాఫీస్ బద్దలు కొట్టే సక్సెస్ ఇచ్చాడు. ఈ మూవీని సపోర్ట్ చేసిన ఈటీవీ విన్ వారికి, వంశీ నందిపాటి, బన్నీవాస్ గారికి కంగ్రాట్స్. సురేష్ బొబ్బిలి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. మిట్టపల్లి సురేందర్ నేను చిరంజీవి గారితో చేస్తున్న సినిమాకు పాటలు రాయాలి. అలాగే డైరెక్టర్ సాయిలు చిన్న క్యారెక్టర్ లో నటించాలి. కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్, పవర్ స్టార్స్ కావొచ్చు...టాలెంట్ ఎవరి సొత్తు కాదని అఖిల్ ప్రూవ్ చేశాడు. తేజస్వినీ చాలా హానెస్ట్ గా నటించింది. ఆమెను సావిత్రి గారితో పోలుస్తున్నారు. అఖిల్, తేజస్వినీ మరిన్ని మంచి మూవీస్ చేయాలి. చైతన్యకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా చూడండి అని చెప్పాల్సిన పని లేదు. ఈ వేదిక మీద కనిపిస్తున్న ఆనందమే విజయాన్ని చూపిస్తోంది. అన్నారు.
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - మనం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే విజయాన్ని దేవుడు తప్పకుండా అందిస్తాడు. ఈ టీమ్ కు కూడా అలాంటి సక్సెస్ అందించాడు. ఈ యంగ్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం నాకొక హ్యాపీ మూవ్ మెంట్. దేవుడు మనుషుల రూపంలోనే మనకు హెల్ప్ చేస్తుంటాడు. మా కెరీర్ బిగినింగ్ లో ఎవరు హెల్ప్ చేసినా దేవుడిగా భావించేవాళ్లం. ఇప్పుడు నెలకో కంటెంట్ ఉన్న చిన్న సినిమా రిలీజ్ కు తీసుకొస్తూ వంశీ నందిపాటి, బన్నీ వాస్ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రెడబిలిటీ వంశీ, బన్నీ వాస్ కు లైఫ్ లో చాలా హెల్ప్  అవుతుంది. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు పనిచేసిన టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరునా నా శుభాకాంక్షలు అందిస్తున్నా.

యాక్టర్ చైతన్యతో కలిసి వర్క్ చేయాలని ఉంది. అతని మూవీస్ చూస్తుంటే ఒకరోజు మాకు కూడా దొరకకుండా వెళ్తాడని అనిపిస్తోంది. అఖిల్, తేజస్వినీ బాగా నటించారు. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. వేణు నేను కలిసి నీదీ నాదీ ఒకే కథ మూవీ చేశాం. మట్టిలో నుంచి పుట్టిన కథలు వేణు దగ్గర చాలా ఉన్నాయి. ఆయన డైరెక్షన్ చేసుకుంటూనే సాయిలు లాంటి చాలామంది కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేయించాలని కోరుకుంటున్నా. వేణు దగ్గర ఉన్న కథలు మన ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈటీవీ విన్ టీమ్ కు కంగ్రాంట్స్. ఆడియెన్స్ కు కావాల్సిన కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు కంటిన్యూగా సక్సెస్ వస్తోంది. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ఇమ్రాన్ ఖాన్ మృతి? పాకిస్తాన్‌లో పుకార్లు

మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments