Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ సినిమా.. నా బాడీ షేపింగ్ విషయంలో?

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (15:49 IST)
సీనియర్ హీరో నాగార్జునతో చేసిన మన్మధుడు 2 సినిమా ఫెయిల్ కావడంతో రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా అడుగుంటాయి. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది.
 
అయితే, బాలీవుడ్‌లో మాత్రం సక్సెస్ కావడంతో అక్కడ సినిమాలు చేస్తున్నది.  రకుల్ ప్రీత్ సింగ్ ఐదేళ్ల క్రితమే బాలీవుడ్‌లో షిమ్లా మిర్చి సినిమా చేసింది. సినిమా పూర్తయ్యి ఐదేళ్లు అయ్యింది. 
 
కానీ, ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. వయాకామ్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.  ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియలేదు. సినిమాకు రమేష్ షిప్పి దర్శకత్వం వహించారు. సినిమా పూర్తి చేసి నిర్మాతల చేతుల్లో పెడితే ఆ సినిమాను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. 
 
జనవరి 3 వ తేదీన సినిమా రిలీజ్ చేయబోతున్నారు.  కానీ, థియేటర్స్ లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో సినిమాను రిలీజ్ చేస్తారట.  దీంతో దర్శకుడు రమేష్ షిప్పి, నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమని ఒక ఊపు ఊపేసిన కాస్టింగ్ కౌచ్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ నోరు విప్పింది. సినీ పరిశ్రమలో తానెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని వెల్లడించిన ఈవిడ తన బాడీ షేపింగ్ విషయంలో మాత్రం పలువురి నుంచి పలు విమర్శలు వచ్చాయని తెలిపింది. 
 
ఈ సందర్భంగా మాట్లాడిన ఆవిడ.. "క్యాస్టింగ్ కౌచ్ విషయంలో మనం ఎలా వ్యవహరించామనేది ముఖ్యం. మనం మెతకగా ఉంటే ఇబ్బందులు తప్పవు. నా కెరీర్‌లో నేనెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు. అయితే నా బాడీ షేపింగ్ విషయంలో మాత్రం పలు విమర్శలు వచ్చాయి. నా బాడీ షేప్ సరిగ్గా లేదని, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని కొందరు చెప్పారు. అయితే ఆ తర్వాత వారే నా అందాన్ని అభినందించారు" అని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం