Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కబాలి'' ట్రైలర్ రికార్డు అదుర్స్.. 26 గంటల్లోనే 54లక్షల హిట్స్.. ఎలక్షన్ తర్వాతే?

Webdunia
సోమవారం, 2 మే 2016 (16:44 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలి సినిమా ద్వారా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆదివారం మే 1ను పురస్కరించుకుని రిలీజైన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. లేటు వయసులోనూ గడ్డం పెట్టుకుని.. స్టైల్‌లో ఏమాత్రం తీసిపోని విధంగా రజనీకాంత్ లుక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా రాధికా ఆప్టే నటించగా, పా రంజిత్ దర్శకత్వం వహించారు.
 
ఇక కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆదివారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియా యమా క్రేజ్ లభిస్తోంది. ఈ ట్రైలర్‌కు ఐదు మిలియన్ల వ్యూవ్స్, 2.25 లక్షల లైక్స్ వచ్చాయని నిర్మాత వెల్లడించారు. 
 
కబాలీ ట్రైలర్ ద్వారా రజనీకాంత్ షారూఖ్ ఖాన్ (దిల్వాలే ట్రైలర్ 24 గంటల్లో 3.6 మిలియన్స్) రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే తమిళ సినిమా తెరి (24 గంటల్లో 2.2 మిలియన్ వ్యూవ్) రికార్డును కూడా అధిగమించాడు. ఈ సినిమా డైలాగ్స్, సంగీతం, యాక్షన్ సీక్వెన్స్, రజనీకాంత్ లుక్స్ బట్టి చూస్తే లింగా ఫట్‌కు తర్వాత రజనీకాంత్ పక్కా హిట్ కొట్టేస్తారని సినీ పండితులు అంటున్నారు. 
 
మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో 65 ఏళ్ల సూపర్ స్టార్ డాన్‌గా నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అదీ తమిళనాడు ఎలక్షన్స్ ముగిశాక జూలైలో కబాలి ప్రేక్షకుల ముందుకు వస్తాడని సినీ యూనిట్ వెల్లడించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments