Webdunia - Bharat's app for daily news and videos

Install App

20న రజినీకాంత్ '2.O' ఫస్ట్ లుక్...

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (16:42 IST)
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.O' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న '2.O' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను నవంబర్‌ 20న ముంబైలోని యశ్‌రాజ్‌ స్టూడియోలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్‌ టైమ్‌ మోడ్రన్‌ టెక్నాలజీతో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని లైకా ప్రొడక్షన్స్‌ యూ ట్యూబ్‌ ఛానల్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేయబోతున్నారు. 
 
ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, ఎమీజాక్సన్‌, సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌, డైరెక్టర్‌ శంకర్‌, నిర్మాత సుభాష్‌ కరణ్‌తోపాటు '2.O' చిత్రం యూనిట్‌ సభ్యులంతా పాల్గొంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్వహిస్తారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments