Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తా : రజనీకాంత్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై తమిళనాట పెద్ద చర్చే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తమ అభిమాన సంఘాలతో రజనీకాంత్ సమావేశం కానున్నారు. రాజకీయ రంగ ప్రవ

Webdunia
సోమవారం, 15 మే 2017 (12:02 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై తమిళనాట పెద్ద చర్చే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తమ అభిమాన సంఘాలతో రజనీకాంత్ సమావేశం కానున్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానుల అభిప్రాయాలు సేకరించే నిమిత్తమే రజనీకాంత్ ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
దీనిపై రజనీకాంత్ స్పందిస్తూ.. ఇప్పటికి తాను నటుడినేనని, అందరికీ నచ్చే సినిమాలను చేసి రంజింపజేయడమే తన కర్తవ్యమని, రేపు దేవుడు తనకు ఏం పని అప్పగిస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు ఎన్నడూ లేదని చెప్పిన ఆయన, తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉంటానని అన్నారు. 
 
తనకు అభిమానుల అండ, వారి ప్రేమ, ఆప్యాయతలే పదివేలని, వివాదాస్పద ప్రకటనలు చేసి వారిని అయోమయంలోకి నెట్టివేయడం తనకిష్టం లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు, వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments