Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంలో నటించడానికి డబ్బులివ్వడం లేదు.. అదే నా సింప్లిసిటీ : రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తుంది. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ గర్వం, అహంకారం లేకుండా వినయంగా ఉంటారు. అదే విషయాన్ని ఆయనను అడిగినపుడు ఆసక

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (11:01 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తుంది. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ గర్వం, అహంకారం లేకుండా వినయంగా ఉంటారు. అదే విషయాన్ని ఆయనను అడిగినపుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
తాజాగా, ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ‘రోబో 2.ఓ’ చిత్రం ఆడియో వేడుక దుబాయ్‌లో శుక్రవారం జరుగనుంది. అయితే, ఈ కార్యక్రమానికి ముందుగా ఆ చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఇందులో హీరో రజనీకాంత్‌ కూడా పాల్గొన్నారు. ఆయనను విలేకరులు ఓ ఆసక్తికర ప్రశ్న అడగగా, అందుకు, ఆయన అంతే ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
 
"మీరు ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు సార్?" అని ఓ విలేకరి ప్రశ్నించగా, అందుకు రజనీ స్పందిస్తూ, ‘నిజ జీవితంలో నటించమని నాకు ఎవ్వరూ డబ్బు ఇవ్వరు. అందుకే, సింపుల్‌గా ఉంటా’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వేశారు. కాగా, ‘రోబో 2.0’లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అమీజాక్సన్ నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమర్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments