Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మానాన్న జీవితాలను చూసి తెలుసుకున్నా: రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్యా

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (08:01 IST)
‘‘ఒక విజయవంతమైన వైవాహిక జీవితానికి గల కారణాలను మా అమ్మానాన్న జీవితాలను చూసి తెలుసుకున్నాను. జీవితం అనే ప్రతి మలుపులోనూ మా గ్రాండ్‌ పేరెంట్స్‌ దేవదూతల్లా ఈ ఇద్దర్నీ కాపాడుకుంటూ వస్తున్నారని నా నామ్మకం.

మ్యారేజ్‌ అంటే ఒకరి బాధ్యతను ఒకరు మోయడం అనే విషయాన్ని అమ్మానాన్నని చూసి తెలుసుకున్నాను. ఒక బంధం బలపడటానికి భార్యాభర్త మధ్య ఉండే స్నేహం కారణమవుతుందనే విషయం అర్థమైంది.

వ్యక్తులుగా ఎదిగే ప్రతి దశలోనూ జీవితం తాలూకు ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ, జీవితానికి అర్థం తెలుసుకుంటూ ఉంటాం’’ అంటూ అప్పా (నాన్న).. అమ్మా... మీ ఇద్దరికీ సూపర్‌ డూపర్‌ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అన్నారు రజనీకాంత్, లత పెద్ద కుమార్తె ఐశ్వర్య.
 
‘‘ఆమె అందర్నీ తన కుటుంబంలా భావించింది. ఆయన ఆమె కుటుంబాన్ని తన కుటుంబం అనుకున్నాడు. ఇద్దరూ కలసి ఒక మంచి కుటుంబం ఏర్పడటానికి కారణం అయ్యారు’’ అని  తన తల్లిదండ్రులు రజనీకాంత్, లత గురించి ఐశ్వర్య అన్నారు.

ఫిబ్రవరి 28 రజనీ–లత నలభయ్యో వివాహ వార్షికోత్సవం. 1981లో ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. నలభయ్యో వార్షికోత్సవం సందర్భంగా రజనీ–లతల పెద్ద కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌ ఇన్‌ స్టాగ్రామ్‌లో ఈ విధంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో గొడవలు.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య.. పిల్లల్ని కూడా..?

అల్పపీడన ద్రోణి.. ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

రూ.18లక్షలు స్వాహా.. హైదరాబాద్‌లో టెక్కీని నిమిషాల్లో కాపాడారు..

ఇంట్లో దొంగలు పడ్డారు.. నగలు, నగదు గోవిందా.. ఫ్రిజ్‌లో పెట్టిన బిర్యానీ కూడా..?

మంగళగిరి ఎయిమ్స్‌లో నీటి కొరతా.. చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

తర్వాతి కథనం
Show comments