Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ ముఖ్యమంత్రి, కమల్ హాసన్ ఉప ముఖ్యమంత్రి.. విజయ్, అజిత్ అదే పార్టీలో?

అన్నాడీఎంకే, డీఎంకేకు చెక్ పెట్టే దిశగా తమిళనాడులో కొత్త పార్టీ ఉదయించాలని ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో.. తమిళ హాస్యనటుడు ఎస్వీ శేఖర్.. కొత్త వాదనను వినిపించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (12:16 IST)
అన్నాడీఎంకే, డీఎంకేకు చెక్ పెట్టే దిశగా తమిళనాడులో కొత్త పార్టీ ఉదయించాలని ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో.. తమిళ హాస్యనటుడు ఎస్వీ శేఖర్.. కొత్త వాదనను వినిపించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టాలి. ఆ పార్టీలో కమల్ హాసన్‌ చేరాలని.. రజనీకాంత్ ముఖ్యమంత్రిగానూ.. కమల్ హాసన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఎస్పీ శేఖర్ అన్నారు. ఆ కూటమిలో అజిత్, విజయ్ కూడా చేరవచ్చు. 
 
సినీ నటులు సరైన రీతిలో పాలన చేస్తారనే విషయాన్ని ప్రజలకు నిరూపించి చూపాలన్నారు. ఎవరు రాజకీయాల్లోకి రావాలి. రాకూడదని ఓట్లు వేసే ప్రజలే నిర్ణయించాలే తప్ప.. రాజకీయ నాయకుడు తీర్మానించకూడదన్నారు. 
 
ఇదిలా ఉంటే... ఇప్పటికే ఆపరేషన్ కమల్ ప్రారంభమైంది. దీంతో తమిళ సర్కారు వెబ్ సైట్లో మంత్రుల వివరాలు గల్లంతయ్యాయి. నటుడు కమల్ హాసన్‌కు.. తమిళ సర్కారుకు మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ నాడులో అవినీతి సర్కారు పాలన జరుగుతుందని కమల్ ఫైర్ అయ్యాడు. కమల్‌కు నిరసనగా తమిళ మంత్రులు మండిపడ్డారు. ఆధారాలు లేకుండా కమల్ చేస్తున్న వ్యాఖ్యలు సబబు కాదన్నారు. 
 
అయితే కమల్ హాసన్ డిజిటల్ పద్ధతి ద్వారా తమిళ మంత్రుల వివరాలను ట్విట్టర్లో పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఇంకా ప్రజలు అవినీతితో ఎదుర్కొన్న ఇబ్బందులను సంబంధిత శాఖకు చెందిన మంత్రులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు కమల్ సూచించారు. అంతేకాదు.. తమిళ సర్కారుకు చెందిన వెబ్ సైట్‌ను కూడా ట్యాగ్ చేశారు. అంతే సీన్ మారింది.
 
ఈ నేపథ్యంలో కమల్ ట్యాగ్ చేసిన వెబ్ సైట్లో మంత్రుల వివరాలతో కూడిన లింకు మాయమైంది. మంత్రుల వివరాలు అంటే ఫోన్ నెంబర్, ఈ-మెయిల్, చిరుమానాలన్నీ కనిపించకుండా పోయాయి. కమల్ ట్యాగ్ చేసిన తర్వాతే మంత్రులతో కూడిన వివరాలు సైట్లో కనిపించకుండా పోయాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments