Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకున్నాడా? షూ లేస్ కూడా కట్టాడా? ఇంతకీ ఎవరతను?

బాహుబలి సినిమాతో టాలీవుడ్ గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి.. తిరుగులేని దర్శకుడిగా వెలుగొందుతూనే.. తండ్రి మెచ్చిన తనయుడిగానూ మంచి పేరు కొట్టేశాడు. దేశ వ్యాప్తంగా బాహుబలి

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (13:50 IST)
బాహుబలి సినిమాతో టాలీవుడ్ గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి.. తిరుగులేని దర్శకుడిగా వెలుగొందుతూనే.. తండ్రి మెచ్చిన తనయుడిగానూ మంచి పేరు కొట్టేశాడు. దేశ వ్యాప్తంగా బాహుబలితో అమాంతం క్రేజును కొల్లగొట్టి రాజమౌళి... ఓ వ్యక్తి కాళ్ళు పట్టుకున్నారట. కాళ్లు పట్టుకోవడం కాదు.. ఒకాయన కాళ్ళకు ఉన్న షూ లెస్‌ను స్వయంగా కట్టి అందరికీ షాకిచ్చాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆయన కాళ్ళ మీద పని షూ కట్టాల్సిన అవసరం జక్కన్నకు ఎందుకొచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే అసలు విషయం ఉంది. 
 
అందరూ అనుకున్నట్లు రాజమౌళి షూ లెస్ కడుతున్నది ఎవరికో పరాయి వాళ్ళు కానేకాదు. స్వయంగా జక్కన్నతండ్రి విజయేంద్ర ప్రసాద్. అవును.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీవల్లి’ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు గెస్ట్‌గా వచ్చిన రాజమౌళి.. స్టేజ్ మీద తన తండ్రి కాళ్ళకు ఉన్న షూ ఊడిపోవడంతో, వెంటనే కింద కూర్చొని ప్రేమతో తన తండ్రి షూ లేస్ కట్టాడు. 
 
ఈ సీన్‌ను చూసినవారంతా.. పిల్లలు ఎంత పెద్ద స్టార్స్ అయినా తల్లిదండ్రుల వద్ద ప్రేమను చాటుకుంటారనే విషయాన్ని రాజమౌళి నిరూపించాడని మాట్లాడుకున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం బాహుబలి2 షూటింగ్‌లో రాజమౌళి బిజీగా ఉండగా, ఆ చిత్రాన్ని ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments