Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేశావు జక్కన్నా...? శివగామి ఫైర్... ఏంటి సంగతి?

బాహుబలి అనగానే అందులో అమ్మ శివగామి క్యారెక్టర్ పోషించిన రమ్యకృష్ణ గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణది ప్రధాన పాత్ర. ఐతే బాహుబలి 1000 కోట్లు దాటిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఓ ట్రెయిలర్ రూపొందించారు. 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌.. నెం.1 బ్లాక్‌బస్ట

Webdunia
మంగళవారం, 9 మే 2017 (13:22 IST)
బాహుబలి అనగానే అందులో అమ్మ శివగామి క్యారెక్టర్ పోషించిన రమ్యకృష్ణ గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణది ప్రధాన పాత్ర. ఐతే బాహుబలి 1000 కోట్లు దాటిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఓ ట్రెయిలర్ రూపొందించారు. 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌.. నెం.1 బ్లాక్‌బస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా" పేరుతో 30 సెకన్ల ఓ వీడియోను విడుదల చేసింది. ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా పదిరోజుల్లోనే వెయ్యికోట్లు రాబట్టింది. అమెరికాలో వంద కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
 
తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఒక ప్రాణం.. అంటూ సాగే పాటలతో ఈ వీడియో ప్రారంభం కాగా, మధ్య.. మధ్యలో "నీకెప్పుడైనా మీ అమ్మను చంపాలనిపించిందా?’ అంటూ బిజ్జలదేవుడి ప్రశ్న.. ‘దేవసేన ఒంటిపై చేయి పడితే బాహుబలి కత్తిపై చేయి పడినట్లే'' అంటూ అమరేంద్ర బాహుబలి డైలాగ్‌, "మన నెత్తురే ఓ మహాసేన" అంటూ మహేంద్ర బాహుబలిగా ఉద్వేగంతో చెప్పే డైలాగ్‌లున్నాయి. ఐతే బాహుబలికి వెన్నెముక లాంటి శివగామిని ఎక్కడా చూపించలేదు. దీనిపై ఇప్పుడు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. తప్పు చేశావు జక్కన్నా...? శివగామి ఫైర్... అంటూ సెటైర్లు వేస్తున్నారు.

చూడండి వీడియో...

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments