Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రమదేవికి జక్కన్న సపోర్ట్: ఫస్ట్ షో చూసేస్తా.. కేసీఆర్ పన్ను మినహాయింపు!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (16:47 IST)
రుద్రమదేవికి జక్కన్న సపోర్ట్ చేశారు. బాహుబలి మేకర్ రాజమౌళి రుద్రమదేవిపై ప్రశంసలు గుప్పించారు. ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యానని.. రుద్రమదేవిపై అంచనాలు భారీగా ఉన్నాయన్నారు. అలాగే గుణశేఖర్ రుద్రమదేవిలో వినియోగించిన త్రీడీ క్వాలిటీ అదిరిపోయిందని రాజమౌళి కొనియాడారు. రుద్రమదేవి తొలి రోజు.. ఫస్ట్ షో చూస్తానని చెప్పారు.
 
తద్వారా రుద్రమదేవిపై ప్రశంసలు గుప్పించిన తొలి సెలబ్రిటీగా రాజమౌళి నిలిచారు. ట్విట్టర్ ద్వారా రుద్రమదేవిపై జక్కన్న మినహా ఏ ఒక్కరూ సామాజిక వెబ్ సైట్ల ద్వారా స్పందించలేదు. ఒకవేళ జక్కన్నను టాలీవుడ్ సెలబ్రిటీలు ఫాలో అవుతారో లేదో వేచి చూడాలి. ఇప్పటికే 
 
రుద్రమదేవి కథాంశంతో తెరకెక్కిన రుద్రమదేవి చిత్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వినోదపన్ను మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయాల్సిందిగా సీఎస్ రాజీవ్‌శర్మను ఆదేశించారు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. చిత్ర బృందంతో కలిసి దర్శకుడు గుణశేఖర్ గురువారం క్యాంపు ఆఫీస్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రుద్రమదేవి గొప్పతనాన్ని చిత్రీకరించినందుకు దర్శకుడు గుణశేఖర్‌కు అభినందనలు. ఇలాంటి సినిమాలు మరెన్నో నిర్మించాలి. చారిత్రక చిత్రాలను ప్రభుత్వం తప్పక ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments