Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మ‌హారాజా ర‌వితేజ - అనిల్ రావిపూడి చిత్రం 'రాజా ది గ్రేట్‌'

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో 'ప‌టాస్'‌, 'సుప్రీమ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (16:01 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో 'ప‌టాస్'‌, 'సుప్రీమ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం 'రాజా ది గ్రేట్'. 'వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్' ఉప శీర్షిక. సోమవారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా లాంచ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ర‌వితేజ‌, మెహ‌రీన్‌ల‌పై ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో, నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఎం.వి.ఆర్‌.ఎస్‌.ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ 'ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా రాజాది గ్రేట్‌. అలాగే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాల‌ను దాటి ఈ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది' అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... 'ర‌వితేజ‌తో చేస్తున్న విభిన్న కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టివ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. అలాగే దిల్‌రాజు బ్యాన‌ర్‌లో రెండో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌వితేజ‌ అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియజేస్తాం' అన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments