Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు విభిన్న వైవిధ్యాలను రాజ్ తరుణ్ చూపించారుః నాగ చైతన్య

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (14:08 IST)
Rajtarun, chitu, Srinu Gavireddy
రాజ్ తరుణ్,  శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం `అనుభవించు రాజా`. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది.
నాగార్జున ఇటీవ‌లే చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.
 
అనంత‌రం నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘అనుభవించు రాజా సినిమాలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఈ పాటను చూశాను. ఎంతో అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటకు చక్కగా కుదిరాయి. ఆల్రెడీ నేను సినిమా కూడా చూశాను. సినిమా ఆసాంతం ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో రాజ్ తరుణ్ రెండు రకాల వెరియేషన్స్‌ను చూపించారు. అద్భుతమైన సందేశంతో, ఆద్యాంతం ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అనుభవించు రాజా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
గోపీ సుందర్ అందించిన ఈ పాటలో.. జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రను వినోదంగా చూపించారు. కోడి పందెలు, రికార్డింగ్ డ్యాన్సులు, సంక్రాంతి పండుగ వాతావరణం అంతా కూడా ఇందులో కనిపిస్తుంది. రామ్ మిర్యాల పాడిన ఈ పాటకు భాస్కర భట్ల అద్భుతైన సాహిత్యాన్ని అందించారు. విజువల్స్ ఎంతో కలర్ ఫుల్‌గా ఉన్నాయి. ఇక కొరియోగ్రఫీ కూడా ఎంతో చక్కగా కుదిరింది. సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి ఈ పాట పెర్ఫెక్ట్ ఛాయిస్..
 
సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ నటిస్తున్నారు. భాస్కర భట్ల సాహిత్యాన్ని అందిస్తుండగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు : రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా
 
సాంకేతిక బృందంః  రచయిత, దర్శకత్వం : శ్రీను గవిరెడ్డి, నిర్మాత  : సుప్రియ యార్లగడ్డ, సంగీతం  : గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆనంద్ రెడ్డి కర్నాటి,  సినిమాటోగ్రఫర్  : నాగేష్ బానెల్,  ఎడిటర్  : చోటా కే ప్రసాద్, లిరిక్స్  : భాస్కర భట్ల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

ఇకపై సీసీటీవీ నిఘా నీడలో సీబీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments