Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుస్తీ పోటీల నేప‌థ్యంలో రాయ్ ల‌క్ష్మీ జ‌న‌తాబార్

డీవీ
గురువారం, 11 ఏప్రియల్ 2024 (15:26 IST)
Rai Lakshmi
ప్ర‌ముఖ క‌థానాయిక రాయ్ ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తెలుగు చిత్రం జ‌న‌తాబార్‌. రోచిశ్రీ మూవీస్ ప‌తాక‌పంపై అశ్వ‌థ్‌ నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మ‌ణ  మొగిలి స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు శ‌క్తిక‌పూర్ ఇంపార్టెంట్ పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్రం ట్రైయిల‌ర్ హీరో శ్రీ‌కాంత్ విడుద‌ల చేశాడు.  అన్ని ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మేలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ కుస్తీ పోటీల నేప‌థ్యంలో న‌డిచే క‌థ ఇది. నేటి స‌మాజంలో స్త్రీ ప్రాధాన్య‌త‌ను చాటి చెప్పే చిత్ర‌మిది. నాలుగు పాట‌లు, ఫైట్స్‌ల‌తో కొన‌సాగే రెగ్యుల‌ర్ చిత్రం కాదు. క‌మ‌ర్షియాల్ అంశాలు వుంటూనే స‌మాజానికి చ‌క్క‌ని సందేశాన్ని మేళ‌వించి రూపొందించిన చిత్ర‌మిది అన్నారు. 
 
క‌థానాయిక ల‌క్ష్మీరాయ్ మాట్లాడుతూ తెలుగులో మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్న త‌రుణంలో ర‌మ‌ణ మొగిలి చెప్పిన ఈ క‌థ న‌న్ను ఎంతో ఆలోచింప‌జేసింది. ఒక‌వేళ ఈ చిత్రం చేయ‌క‌పోతే నా కెరీర్‌లో ఓ మంచి చిత్రాన్ని కోల్పోయేదాన్ని. న‌న్ను నేను కొత్తగా ఆవిష్క‌రించుకోవ‌డానికి ఈ సినిమా ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఈ చిత్రంలో నా పాత్ర బార్‌గ‌ర్ల్‌గా ప్రారంభ‌మై స‌మాజంలో మ‌హిళ‌లు గొప్ప‌గా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది అనేది ఎంతో ఆస‌క్తిక‌రంగా వుంటుంది అన్నారు. యానిమ‌ల్ త‌రువాత  ఈచిత్రంలో మ‌ళ్లీ ఓ మంచి పాత్ర‌ను చేశాన‌ని, ఈ సినిమాలో త‌న  పాత్ర  న‌లుగురు చెప్పుకునేంత గొప్ప‌గా వుంటుంద‌ని  శ‌క్తిక‌పూర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ద్వారంపూడిని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్... అలవాట్లు మార్చుకోండి..

పోలవరం.. విభజన కంటే జగన్‌తో రాష్ట్రానికి ఎక్కువ నష్టం: చంద్రబాబు

ఒకే వేదికను పంచుకోనున్న టి.సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి

తిరిగేది పరదాల చాటున, అయినా 986 మంది సెక్యూరిటీయా? మాజీ సీఎం జగన్ పైన సీఎం చంద్రబాబు (video)

కొత్త ఈవీ బ్యాటరీని తయారు చేసిన తెలుగు వ్యక్తి, 5 నిమిషాల చార్జింగ్‌తో 193 కిలోమీటర్ల ప్రయాణం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

తర్వాతి కథనం
Show comments