Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ చేసుకున్న శ్రీముఖి, రాహుల్.. సోషల్ మీడియాలో వైరల్

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (12:23 IST)
బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ అండ్ విన్నర్, రన్నర్ శ్రీముఖి, రాహుల్ పార్టీ చేసుకున్నారు. పటాస్ షో ద్వారా శ్రీముఖి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.  బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం తోటి సభ్యుడు రాహుల్‌తో గొడవ పడుతూ వీలున్నప్పుడల్లా రాహుల్‌ను నామినేట్ చేస్తూ చూసే ప్రేక్షకుల్లో ఒకరకమైన ఇంప్రెషన్‌తో ముందుకు సాగి చివరికి రాహుల్‌తోనే పోటి పడి మూడవ సీజన్ రన్నరప్‌గా నిలిచింది. 
 
హౌజ్‌లో ఉన్నంత కాలం శ్రీముఖి ఎక్కువగా బాబా బాస్కర్‌తో ఉంటే.. రాహుల్ మాత్రం వరుణ్, వితిక, పునర్నవిలతో ఉండేవాడు. ఈరెండు గ్రూపులకు అంతగా పడేదికాదు. అంతేకాదు ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఓ షో కోసం రాహుల్ ఆ మధ్య శ్రీముఖికి ఫోన్ చేస్తే మాట్లాడలేదని ప్రెస్ మీట్ సందర్బంగా రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే.
 
అయితే అదంతా మరిచిపోయిన ఈ ఇద్దరూ తాజాగా ఓ పార్టీలో సందడి చేశారు. దానికి సంబంధించిన ఓ వీడియోను వితిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే వీడియోను శ్రీముఖి తన సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసింది. ఆ వీడియోలో శ్రీముఖి, రాహుల్, వరుణ్, వితికలు ఫుల్‌గా ఊగుతూ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసినవారంతా హౌజ్ మేట్స్ అంతా ఏకమయ్యారని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments