Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘవ లారెన్స్, న‌టిస్తున్న‌ రుద్రుడు ఫస్ట్ లుక్

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (17:59 IST)
Lawrence, Rudrudu First Look
నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు.
 
ఈ చిత్రానికి 'రుద్రు'డు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమా యాక్షన్‌లో హైలైట్‌గా వుండబోతుంది.
 
'ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్' అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ ఈవిల్ లుక్ లో కనిపించడం ఆసక్తినిపెంచింది.
శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.
 
సినిమా తొంభై శాతం షూటింగ్ పూర్తయింది. 'రుద్రుడు' 2022 క్రిస్మస్‌కు థియేటర్లలో విడుదల కానుంది.
 
తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు
 
సాంకేతిక విభాగం: దర్శకత్వం - కతిరేశన్, నిర్మాత- కతిరేశన్,  బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్,  డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి,  ఎడిటర్: ఆంథోనీ, స్టంట్స్: శివ - విక్కీ
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments