రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రుద్రుడు' విడుదలకు సిద్ధమౌతోంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 'ఈవిల్ ఈజ్ నా బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్' అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన రుద్రుడు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ రుద్రుడు ఫస్ట్ సింగల్ ప్రాణాన పాటలే పాడుతుంది పాటని ఈ రోజు విడుదల చేశారు. వీర తిరుమగన్ చిత్రంలోపాడాద పాటెలం క్లాసిక్ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేసి ట్రెండీ, ఫుట్ ట్యాపింగ్ గా ప్రజంట్ చేశారు. ధరన్ కుమార్ ఈ పాటని ఎక్స్ ట్రార్డినరీగా రిక్రియేట్ చేయగా.. రాకేందు మౌళి ఈ పాటకు అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో లారెన్స్ డ్యాన్స్ మూవ్స్ మెస్మరైజ్ చేశాయి.
ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.
రుద్రుడు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.