Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ ఎలా డ్యాన్స్ చేస్తాడో ఏమో.. కాస్త చూడు లారెన్స్.. చిరు టెన్షన్!

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (13:29 IST)
మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడైన రామ్ చరణ్ తన పేరు నిలబెట్టుతాడో లేదోనని టెన్షన్ పడ్డాడట. అయితే టాలీవుడ్ రారాజుకు తగిన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి రెండు సినిమాలతోనే తనేంటో చెర్రీ రుజువు చేసుకుని హీరోగా ఎదిగిపోయాడు. డ్యాన్స్‌లో చిరంజీవి నెంబర్ వన్ అనిపించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు తెలుగు పరిశ్రమలో డ్యాన్సులకు క్రేజ్ తెచ్చిందే చిరంజీవి. 
 
అయితే డ్యాన్స్ విషయంలో అంత గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.. తన కొడుకు చరణ్ ఎలా డ్యాన్స్ చేస్తాడా అని అతను సినిమాల్లోకి రాకముందు చాలా టెన్షన్ పడ్డాడట. చరణ్ తన పేరు నిలబెడతాడో లేదో అని ఆందోళన చెందాడట. ఈ సంగతి రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు. చెన్నైలో బ్రూస్ లీ తమిళ వెర్షన్ ఆడియో ఫంక్షన్‌లో లారెన్స్ మాట్లాడుతూ.. తెలుగులో నేను నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ అయ్యానంటే అందుకు చిరంజీవి గారే కారణమన్నాడు. 
 
చరణ్ విషయంలో చిరంజీవి ఎంత టెన్షన్ పడ్డారో నాకింకా గుర్తుందన్నాడు. ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా పాటకు స్టెప్స్ కంపోజ్ చేయిస్తున్నపుడు చరణ్ అక్కడే ఉన్నాడు. ఓసారి చరణ్‌తో డ్యాన్స్ చేయించి చూడమని చిరంజీవి నాతో పాటు ఓ గదిలోకి పంపించాడు.

ఆ తర్వాత చిరంజీవి కూతురి పెళ్లికి అతడితో డ్యాన్స్ చేయిద్దాం అనుకున్నాం. వారం రోజులు నేనే ట్రైనింగ్ ఇచ్చా. ఐతే ఆ టైంలో చిరు సార్ చాలా టెన్షన్ పడ్డాడు. చరణ్ పనికొస్తాడా అని చాలా టెన్షన్‌గా అడిగారు. అప్పుడు నేను కుర్రాడు దుమ్ముదులుపుతాడు చూడండి అన్నాను. నిజంగానే అక్క పెళ్లిలో చరణ్ అదరగొట్టాడు’’ అని లారెన్స్ తెలిపాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments