Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే సంగీతం జోలికి వెళ్లలేదు.. కాంచన 3 దర్శకుడు

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:39 IST)
తన కొరియోగ్రఫీలో తెలుగు, తమిళ చలన చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపిన డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్. పెద్ద పెద్ద హీరోలతో స్టెప్పులు వేయించి సినిమాలకు హిట్‌లు సంపాదించిపెట్టాడు. కొరియోగ్రఫీతో తన వృత్తిని ప్రారంభించిన లారెన్స్‌లో కొత్త ఆశలు చిగురించాయి. సినిమాలో పాత్రలు వేయాలనుకున్నాడు. చివరికి ఏకంగా హీరోనే అయ్యాడు. అంతే కాకుండా దర్శకత్వంలో కూడా దిగాడు. 
 
బిగ్ స్టార్‌లతో సినిమాలు తీసి మెప్పులు పొందాడు. దర్శకత్వంతో ఆగలేదు. మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేయాలనుకున్నాడు. డాన్, రెబల్ వంటి పెద్ద హీరోల సినిమాలకు సంగీతం అందించడం వివాదాస్పదం అయింది. రాగాలు తెలిసిన నేను సంగీత దర్శకుడిగా మారితే తప్పేంటి అనుకుని ఆ రెండు సినిమాలకు సంగీతాన్ని అందించాను. కానీ నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, సంగీతంలో రాగాలు మాత్రమే ఉంటాయని పొరపాటు పడ్డాను. సంగీతం ఒక సముద్రం లాంటిది. అందుకే పూర్తిగా తెలియని పనిని చేయకూడదని నిర్ణయించుకున్నాను. 
 
అప్పటి నుండి నేను సంగీతం జోలికి వెళ్లలేదు. ఆ రెండు సినిమాలకే మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసి తప్పుచేసానని, దర్శకత్వం గురించి తెలియకపోయినా దర్శకత్వం చేయవచ్చని కానీ సంగీతం అలా కాదని లారెన్స్ చెప్పుకొచ్చాడు. లారెన్స్ తాజాగా నటించిన కాంచన 3 చిత్రం విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమా ప్రమోషన్‌లో మ్యూజిక్ గురించి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ముని సీరీస్ సినిమాలను ఇది బీట్ చేస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments