Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర్వాత‌ మ‌హేష్‌బాబు సినిమానే

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (16:44 IST)
Mahesh
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పెద్ద సినిమా తీసిన త‌ర్వాత మ‌రో చిన్న సినిమా తీయ‌డానికి స‌న్నాహాలు చేస్తుంటార‌ని తెలిసిందే. అయితే ఈసారి అలాంటి ప్ర‌యోగం చేయ‌ర‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల్ల ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా షూటింగ్ ప‌లుసార్లు వాయిదా ప‌డ‌డం తెలిసిందే. ఇప్ప‌టికే ఆర్‌.ఆర్‌.ఆర్‌.మీద ఫుల్ ఫోక‌స్ పెట్టి రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌.టిఆర్‌.తోపాటు బాలీవుడ్ న‌టీన‌టులకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. తాజాగా దోస్తీ అనే పాట‌కు కూడా కీర‌వాణి సార‌థ్యంలో ఈరోజే ముహూర్తం పెట్టారు.
 
ఇదిలా వుండ‌గా, రాజ‌మౌళి త‌ర్వాత సినిమా మ‌హేష్‌బాబు సినిమా అనేది ఖ‌రారైంది. ఇంత‌కుముందే ఈ వార్త‌ను ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ వెల్ల‌డించారు. తాజాగా ఆ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ప్ర‌ముఖ ఫొటోగ్రాఫ‌ర్ ఎస్‌. గోపాల్‌రెడ్డి మ‌రోసారి ధృవీక‌రించారు. దుర్గా ఆర్ట్స్ బేన‌ర్‌పై కె.ఎల్‌. నారాయ‌ణ‌తో క‌లిసి ఆయ‌న ప‌లు సినిమాలు నిర్మించారు. ర‌వితేజ‌తో ఎస్‌. గోపాల్‌రెడ్డి `నా ఆటోగ్రాఫ్` అనే సినిమాకూ ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. అయితే ఆయ‌న రాజ‌మౌళి సినిమాకు ఫొటోగ్ర‌పీ మాత్రం చేయ‌ర‌ట‌. అన్ని వివ‌రాలు రాజ‌మౌళిగారే చెబితే బాగుంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments