Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాండవులకు ఆశ్రయం కల్పించిన ఈ దండకారణ్యం: నారాయణ మూర్తి

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (12:37 IST)
స్నేహా చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్ రెడ్డి, త్రినాద్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మర్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ''త్రేతాయుగంలో సీతారాములను, ద్వాపరయుగంలో పాండవులకు ఆశ్రయం కల్పించిన ఈ దండకారణ్యం కలియుగంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. 
 
ప్రభుత్వం చేపట్టే గనులు, బాక్సైట్ తవ్వకాల వలన ఆదీవాసీయుల మనుగడ లేకుండా పోతుంది. పర్యావరణమంతా.. సర్వనాశనం అయిపోతుంది. రాజ్యాంగంలో ఆదీవాసీయుల హక్కులను ఉల్లంగించి ప్రభుత్వం ఈ పనులను చేపడుతుంది. వారి హక్కుల కోసం చర్చించే చిత్రమే ఈ దండకారణ్యం. మూల వనరులు మూలవాసీయులకే చెందాలి. విదేశీపాలు కాకూడదు. ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి. 
 
గద్దర్ మూడు పాటలను పాడారు. వందేమాతరం శ్రీనివాస్ నాలుగు పాటలను రాశారు. గోరటి వెంకన్న, కాశిపతి, ములుగు తిరుపతి వంటి ప్రజాకవులు ఈ సినిమాకు సాహిత్యం అందించారు. ఈ సినిమాలో ఉద్యమకారుడు కోటన్న పాత్రలో నటించాను. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ నెల 20న పాటలను విడుదల చేసి, మార్చి 4న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
 
ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఆపరేటివ్ కెమెరామెన్: నాగేష్ బాబు, కథ,చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కోరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments