Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొత్తం టాలీవుడ్‌నే బోనులో పెడతారా.. ఏడుపొస్తోందన్న నారాయణమూర్తి

కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తే మొత్తం తెలుగు చిత్రపరిశ్రమనే బద్నామ్ చేస్తూ టాలివుడ్‌ను నేరస్తురాలిగా చిత్రీకరించడం చూస్తుంటే ఏడుపొస్తోందని ప్రజానటుడు ఆర్. నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మీడియా యాంకర్ ఆయన ముందు మైకు పెట్టి డ్ర

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (10:50 IST)
కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తే మొత్తం తెలుగు చిత్రపరిశ్రమనే బద్నామ్ చేస్తూ టాలివుడ్‌ను నేరస్తురాలిగా చిత్రీకరించడం చూస్తుంటే ఏడుపొస్తోందని ప్రజానటుడు ఆర్. నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మీడియా యాంకర్ ఆయన ముందు మైకు పెట్టి డ్రగ్స్ వ్యవహారంపై మీ స్పందన ఏంటి అన్నప్పుడు ఆయన చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
 
డ్రగ్స్ సమస్య అనేది తెలుగు చిత్రపరిశ్రమకు మాత్రమే సంబంధించినది కాదు. మనదేశాన్నే కాదు... యావత్ ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న పెద్ద మహమ్మారి డ్రగ్స్. ఇప్పుడు కాదు.. నా బాల్యం నుంచే ఇది నడుస్తోంది. మహానటుడు దేవానంద్ హరేరామ హరే కృష్ణ సినిమాలో దమ్మారే దమ్ అంటూ అంటూ జీనత్ అమన్‌తో చేయించారు ఆ పాట. ఇప్పుడున్న యువత కూడా డ్రగ్స్‌కు అలవాటుపడిపోయి తమ జీవితాలను నిర్వీర్యం చేసుకంటోంది. ఈ క్రమంలో సినిమావాళ్లు డ్రగ్స్ వాడుతున్నారని  చెప్పి సిట్ వాళ్లు పట్టుకోవడం. దాని మీద గత వారం రోజులనుంచి మీడియాలో బీభత్సంగా చూపిస్తున్నారు. 
 
నిజానికి మేము సినిమాలు తీసి చూపిస్తుంటాము. కాని ఇప్పుడు సిట్ అదికారులు మనకు సినిమా చూపిస్తున్నారు. ఇప్పటికి ఇంటర్వెల్ దాకా వచ్చింది. ఇంకా క్లైమాక్స్ ఉందట. అంటే పూరీ జగన్నాథ్‌తో స్టార్ట్ అయి, శ్యామ్, సుబ్బరాజు,  తరుణ్, నవదీప్ కూడా ఎంటరైపోయారు తర్వాత చార్మి, ముమైత్ ఖాన్ కూడా వస్తారట. దీంతర్వాత రవితేజ వచ్చింతర్వాత క్లైమాక్స్ అయిపోతుందట. దీనర్థం ఏమిటి? డ్రగ్స్‌ను  మా సినిమావాళ్లే తీసుకుంటున్నారా? వాళ్లు కూడా తీసుకున్నారని గ్యారంటీ ఏమిటి, రుజువులేమిటి, 
 
మీరు విచారిస్తున్నారు సరే.. అడిగే విధానం ఎలా ఉండాలి. మేమేదో దోషులమైపోయినట్లు, సినిమా ఫీల్డే మొత్తం చెడిపోయినట్లుగా. అలా ఇంటరాగేట్ చేసే విధానం ఏదయితే ఉందో అది బాగాలేదు. జరుగుతున్నది చూస్తూంటే నిజంగానే ఏడుపొస్తోంది. మా సినిమావాళ్లంతే మీకందరికీ ఇంత చులకనా. ఇతరులను హత్య చేసే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి పరిస్థితిలో తప్పు చేసినవారు ఎవరైనా సరే పనిష్మెంట్ ఇవ్వాలి. చాలాకాలంగా రాజకీయ నాయకుల బిడ్డలు, ఆఫీసర్ల బిడ్డలు స్కూళ్లలో, కాలేజీల్లో, హాస్టళ్లో డ్రగ్స్ కి అడిక్ట్ పోయారని పేపర్లలో వార్తలు వస్తోంటే.. మీరు ఏమైపోయారు ఇన్నాళ్లూ. వాళ్లను ఎవరూ ఏ ఇంటరాగేషనూ చేయలేదే.. 
 
ఈ మధ్యలో ఏపీలో మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా విశాఖ ఏజెన్సీలో కొంతమంది నాయకులు గంజాయి సాగుకు అండగా నిలిచి గంజాయిని ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. దీనర్థం ఏమిటి. మీరు నిజంగా డ్రగ్స్ భూతాన్ని తరిమేయాలనుంటే.. మూలాల్లోకి పోయి పెకలించండి. ఎవరు కారకులో వారిని పట్టుకుని శిక్షించండి. అంతే కానీ పనిగట్టుకుని టీవీలల్లో సినిమావాళ్లంతా దొంగలు అని ప్రచారం చేయడం మంచిది కాదు. సినిమావాళ్లు కూడా గౌరవంగా బతుకుతున్నవారే. 
 
డ్రగ్స్ మహమ్మారిని పారదోలాలంటే సిట్ మరే సంస్థ విచారించినా, దర్యాప్తు చేసినా దానికి మనందరం సహకరించాల్సిందే. తప్పును ఖండించాలి, డ్రగ్స్‌ను ఎవరియితే ఇక్కడికి దింపుతున్నారో. ఎవరైతే అంటగడుతున్నారో,. ఎవరైతై వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే మానవ జీవితాలతో ఆడుకుంటున్నారో.. ముందు వాళ్లను పట్టుకుని ఫనిష్ చేయండి ముందు. మూలాల్లోకి పోయి పెకిలించండి. అంతే కానీ ఇలా సినిమావాళ్లు దొంగల్లాగా ప్రచారం చేయడం ఏమీ బాగలేదు. 
 
అకున్ సబర్వాల్‌కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రగ్స్ అంటే సినిమావాళ్లే వాడుతున్నారు. ఇంకెవరూ వాడలేదు అనేంత దుర్మార్గంగా టీవీలు ప్రసారం చేస్తున్నాయి. పేపల్లోనూ హెడ్ లైన్స్ అవే. టీవీల్లోనూ అదే. ఇదేం ఇంటరాగేషన్.. ఇదేమాత్రం సరైంది కాదు. సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వాడుతోంది చాలా చాలా తక్కుప. దేశమంతా పాకిపోయిందది. డ్రగ్స్ అలవాటు పడి ఎంతమంది జీవితాలను నాశనం చే్సుకుంటున్నారు. మీరు ఆ మూలాలను మందు నరికేయండి. అది చేయకుండా ఈ ప్రచారాలేంటీ , ప్రసారాలేండీ మమ్మల్ని దొంగల్లాగా చూడ్డమేమిటి అంటూ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఆవేశంతో కూడిన ఆవేదన వ్యక్తం చేశారు.  
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments