Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణాసుర నుంచి రవితేజ పాడిన ప్యార్ లోన పాగల్ సాంగ్ రిలీజ్

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (17:40 IST)
Raviteja pagal song look
మాస్ మహారాజా రవితేజ,  క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' విడుదలకు సిద్ధమవుతోంది. అభిషేక్ పిక్చర్స్ , ఆర్‌టి టీమ్‌వర్క్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు . హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
 
మొదటి పాట ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా రెండవ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. ఈ బ్రేక్-అప్ సాంగ్ డైనమిక్ గా వుంది. రవితేజ కూడా ఈ పాటను డైనమిక్‌గా ఆలపించారు. కాసర్ల శ్యామ్ అందించిన హార్ట్ బ్రేక్ లిరిక్స్ రవితేజ భావాలను చక్కగా ఆవిష్కరించింది.
 
రవితేజ, ఫరియా అబ్దుల్లా, శ్రీరామ్‌ మధ్య వచ్చే నడిచే సీన్ ని కలర్‌ఫుల్ గా అద్భుతమైన విజువల్స్ తో చూపించారు. పబ్ సెట్ చాలా గ్రాండ్ గా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, రవితేజ డ్యాన్స్‌లు మరో పెద్ద ఆకర్షణ. ఇది మరొక చార్ట్‌బస్టర్ నంబర్ అవుతోంది.
 
శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో  ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
 
సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.  
 
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
ఏప్రిల్ 7, 2023న రావణాసురు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments