Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప'లో నివేదా థామస్.. రష్మిక మందన పాత్ర గుర్తిండిపోతుందట..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:55 IST)
''అల వైకుంఠపురములో'' సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ''పుష్ప" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలై బన్నీ ఫస్ట్ లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ లుక్ కాస్త ఈ సినిమాపై హైప్‌ను పెంచేసింది. 
 
చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మలయాళ నటి నివేదా థామస్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
నాని సరసన 'జెంటిల్‌మన్'తో పాటు ఎన్టీఆర్ 'జై లవకుశ'లో ఓ హీరోయిన్‌గా నటించిన నివేదా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈమె ప్రస్తుతం బన్నీతో కూడా నటించే అవకాశాన్ని కైవసం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై సినిమా యూనిట్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా, కరోనా లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.
 
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని కొల్లగొట్టిన రష్మిక మందన తన పాత్ర గురించి స్పందించింది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాను గురించి రష్మిక మాట్లాడుతూ.. ''పుష్ప'' సినిమాలో తన పాత్ర చాలా భిన్నంగా వుంటుందని చెప్పుకొచ్చింది. ఈ పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ పాత్రలో తాను చాలా కొత్తగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది. నటన పరంగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ పాత్ర ఉంటుందని రష్మిక వెల్లడించింది.

సంబంధిత వార్తలు

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలో కూలగొడుతున్న వైకాపా జెండా దిమ్మెలు!! (Video Viral)

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments