Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగమ్మ తల్లి గెటప్‌లో అల్లు అర్జున్‌.. లీక్ చేసిన డీఎస్పీ

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (19:39 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాబోయే యాక్షన్ డ్రామా పుష్ప 2 కోసం పని చేస్తున్నాడు. ఇది సుకుమార్ దర్శకత్వంలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. పీరియాడికల్ క్రైమ్, యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది. 
 
పుష్ప-2ను పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. పుష్ప షూటింగ్ మొదలైన తర్వాత ఐదు భాషల్లో రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్‌లో వంద కోట్లకు పైగా కలెక్షన్లతో తన సత్తా చాటింది పుష్ప. ఈ సినిమా మొత్తం 360 కోట్లు వసూలు చేసింది. 
 
ఈ క్రమంలో పార్ట్ 2ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న పుష్ప 2 చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక వివరాలను సంగీత దర్శకుడు లీక్ చేశారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే థ్రిల్లింగ్‌గా ఉంది. జాతర నేపథ్యంలో గంగమ్మ అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్‌పై చిత్రీకరించిన సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. 
 
గంగమ్మ గెటప్‌లో అల్లు అర్జున్ లుక్ ఇప్పటికే వైరల్‌గా మారింది. దీనికి భారీ స్పందన వచ్చింది. ఈ గెటప్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 
 
దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత అంచనాలను పెంచుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సునీల్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments