Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘పుష్ప 2: ది రూల్’ నుంచి కపుల్ సాంగ్. ‘అగ్గిర‌వ్వ నా సామీ’ విడుదల

డీవీ
బుధవారం, 29 మే 2024 (11:55 IST)
Allu Arjun Rashmika
‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు.. 
 
ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. ‘పుష్ప’ ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. 
 
ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్, టీజర్, పుష్ప పుష్ప సాంగ్’ యూట్యూబ్‌లో ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పగా.. ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ‘పుష్ప 2: ది రూల్’ నుంచి కపుల్ సాంగ్ ‘సూసేకి  అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన చిన్న ప్రోమో ఎలా వైరల్ అయిందో తెలిసిందే. మేకింగ్ విజువల్స్‌తో వచ్చిన ఈ కపుల్ సాంగ్.. ‘నా సామి’ పాటను బీట్ చేసేలా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అంతకుమించి అనేలా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు.
 

వంటి అద్భుతమైన సాహిత్యంతో వచ్చిన ఈ పాటను 5 భాషల్లోనూ ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడటం మరో విశేషం. ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ పాటతో ‘పుష్ప 2: ది రూల్’పై క్రేజ్ డబులైంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో త‌న న‌ట‌న‌తో మొట్ట‌మొద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం, అలాగే మొట్టమొదటిసారిగా దుబాయ్ మ్యాడ‌మ్ టుసార్ట్స్‌లో ద‌క్షిణ భార‌తదేశ న‌టుడి స్టాట్యూని, గ్యాల‌రీ‌ని ఏర్పాటు చేయ‌టం తెలుగు వారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు ‘పుష్ప’ చిత్రంతోనే సంత‌రించుకున్నాయి. ఇక త్వ‌ర‌లో
‘పుష్ఫ 2: ది రూల్’తో మ‌రోసారి ప్ర‌పంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారు. 90 సంవ‌త్ప‌రాల తెలుగు సినిమా చ‌రిత్రలో మొద‌టిసారి తెలుగు న‌టుడి న‌ట‌న చూసేందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఎదురుచూస్తున్నాయంటే.. ‘పుష్ప’ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వయసు 73 - ఏక బిగువున 51 పుషప్స్... ఆశ్చర్యపరిచిన తమిళనాడు గవర్నర్ (Video)

ఇరాన్‌ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం - విష వాయువులు లీక్?

Vizag Yoga : ఆర్కే బీచ్‌లో 3.01 లక్షల మందితో కామన్ యోగ-గిన్నిస్ రికార్డ్

నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్

జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డబ్బు : నాకేం తెలియదంటున్న నిందితుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments