Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాద్‌ఫాజిల్‌తో పుష్ప-2 కీలక షెడ్యూల్ పూర్తి

Webdunia
గురువారం, 18 మే 2023 (18:04 IST)
sukumar, Fadfazil
సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప-2 దిరూల్ గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది హాట్‌టాపికే..పుష్పగా ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టెర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సన్సేషన్ కాంబోలో రాబోతున్న  పుష్ప-2కు సంబంధించి ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన  వేర్‌ఈజ్ పుష్ప, హంట్ ఫర్ పుష్ప కాన్సెప్ట్ వీడియోకు, ఐకాన్‌స్టార్ లుక్‌కు వచ్చిన  అనూహ్యమైన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
 
అయితే తాజాగా పుష్ప-2 గురించి మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.పుష్ప చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర అందరిని ఎంతగానో అలరించింది.పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగంతి తెలిసిందే. పుష్ప-2లో కూడా ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతున్న సంగతి విదితమే. గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవి ప్రాంతంలో  ఫహద్ ఫాజిల్‌పై  సుకుమార్ దర్శకత్వంలో ్ల ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఓ స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం.ఫహద్‌ఫాజిల్‌తో దర్శకుడు సుకుమార్ కనిపిస్తున్న ఈ స్టిల్ ఇప్పుడు వైరల్‌గా మారింది.  
 
ఫహద్ ఫాజిల్‌కు సంబంధించిన సన్నివేశాల్ని తాజా షెడ్యూల్‌లో పూర్తి చేశామని చిత్రబృందం తెలియజేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకుమార్, ఫహద్ ఫాజిల్ సెట్‌లో ఉన్నప్పటి వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. దీనికి భన్వర్‌సింగ్ షెకావత్ అలియాస్ ఫహద్ ఫాజిల్‌కు తాలూకు ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడు  అంటూ క్యాప్షన్‌ను జత చేశారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్‌రైటింగ్స్ కలయికలో  ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments