Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే టైమ్ వ‌చ్చింది... ఇంత‌కీ హీరో ఎవ‌రు..?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (20:28 IST)
డాషింగ్ డైరెక్ట‌ర్ అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు పూరి జ‌గ‌న్నాథ్. గ‌త కొంత కాలంగా స‌క్స‌ెస్ లేక ఇబ్బంది ప‌డిన పూరి... ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్‌తో ఇస్మార్ట్ శంక‌ర్ దూసుకెళుతున్నాడు. అయితే... పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న‌. ఈ సినిమాని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయాల‌నుకున్నారు. 
 
క‌థ విని మ‌హేష్ ఓకే చెప్పారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. మ‌హేష్ నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో పూరి ఈ సినిమాని వెంక‌టేష్‌తో చేయాల‌నుకున్నారు. వెంకీకి క‌థ చెప్ప‌డం.. క‌థ విని వెంకీ కూడా ఇంట్ర‌ెస్ట్ చూపించిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇటీవ‌ల పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను క‌లిసారని.. విజ‌య్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... విజ‌య్‌తో అస‌లు ఈ ప్రాజెక్ట్ అనుకోలేద‌ట‌. క‌న్న‌డ స్టార్ హీరో యాష్‌తో ఈ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఆల్రెడీ యాష్, పూరి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. స్టోరీ లైన్ విని యాష్ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ట‌. అయితే... ఫుల్ స్టోరీ విన్న త‌ర్వాత చేయాలా..? వ‌ద్దా..? అనేది చెబుతానన్నాడ‌ని తెలిసింది. 
 
ప్ర‌స్తుతం పూరి ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌స్ టూర్లో ఉన్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌ెస్ టూర్ కంప్లీట్ అయిన త‌ర్వాత పూరి యాష్‌కి జ‌న‌గ‌ణ‌మ‌న‌ ఫుల్ స్టోరీ చెబుతార‌ట‌. ఈ సినిమాని తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ స్ధాయిలో రూపొందించాలి అనుకుంటున్నార‌ట‌. మ‌రి... ఈ ప్రాజెక్ట్ పైన త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌స్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments