Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

ఐవీఆర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (18:53 IST)
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ New Resolution 2025తో ఆలోచింపజేసే పోస్ట్ పెట్టారు. ఆయన ఎప్పట్నుంచో పూరి మ్యూజింగ్స్ (Puri Musings) పేరుతో పాడ్ కాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన తన అభిప్రాయం తెలిపారు. న్యూ రిజల్యూషన్ టాపిక్ కింది ఆయన చెప్పినవి ఆలోచింపజేసేవిగా వున్నాయి.
 
"సోషల్ మీడియా ఎంతో శక్తివంతమైనది. ఐతే అది మన చేతిలో ఆడుతున్న తొలిదశలో కమ్యూనికేషన్ భలేగా వుందని అనుకున్నాము. కానీ రానురాను దాని వికృతరూపం బయటపెట్టింది. ఇప్పుడది దెయ్యంలా మారింది. ఈ దెయ్యంలాంటి సోషల్ మీడియాను వాడేవారు ఏడవకుండా వున్నట్లు కనిపించడంలేదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం ఎక్కువైంది. ఆనందంగా వుంటే ఒక ఫోటో. పార్టీకెళితే కుటుంబం ఫోటో. కొత్త దుస్తులు ధరిస్తే మరో ఫోటో. ఇలా అందమైన ఫోటోలను పోస్ట్ చేయడంతో... అవన్నీ చూసి ఏడ్చేవాళ్లు ఎక్కువయ్యారు. వారిలా నేను వుండలేకపోతున్నాననే బాధ పీడిస్తోంది.
 
ఎందుకంటే సోషల్ మీడియా చూసేవారంతా దాదాపు ఏ పని లేనివారే. ముఖ్యంగా పెళ్లయిన దంపతులు వారివారి జీవితాలను సోషల్ మీడియాలో పెట్టడం ఆపేస్తే మంచిది. వారి మధ్య జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఇలా షేర్ చేయడంతో అది ఇతరులకు తెలిసి దంపతుల మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోతుంది. ఫలితంగా విడాకులు కూడా జరుగుతున్నాయి. ఇటీవలి చేసిన ఓ సర్వేలో విడాకులు తీసుకుంటున్న ప్రతి 10 జంటల్లో 3 జంటల విడాకులకు సోషల్ మీడియానే కారణం అవుతోంది. కనుక మీ సంతోషాన్ని ఆవిరి చేస్తున్న ఈ దెయ్యంకి దూరంగా వుంటే జీవితంగా ఎంతో సంతోషంగా వుంటుంది. ఒక్క నెల రోజులు ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది మీ జీవితం ఎంత సంతోషంగా వుంటుందో" 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Puri Connects (@puriconnects)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments