Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్టివ్ పర్సన్.. కొత్తగా ఏది వచ్చినా ఎంజాయ్ చేస్తాడు : పూరీ గురించి సి.కళ్యాణ్

డ్రగ్స్ కేసులో ఇరుకున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గురించి సినీ పరిశ్రమ ప్రాతినిథ్య సంస్థల్లోని ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకూ, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కూ అధ్యక్ష పీఠం

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (17:33 IST)
డ్రగ్స్ కేసులో ఇరుకున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గురించి సినీ పరిశ్రమ ప్రాతినిథ్య సంస్థల్లోని ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకూ, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కూ అధ్యక్ష పీఠంపై ఉన్న సి.కల్యాణ్‌ స్పందించారు.
 
పూరీకి డ్రగ్స్‌ వ్యవహారంలో లింకులు ఉంటాయని, ఆయన డ్రగ్స్‌ వాడారని కూడా నేను నమ్మను. ప్రపంచంలో కొత్తగా ఏది వచ్చినా దాన్ని ఎంజాయ్‌ చేయడం పూరీకి అలవాటు. అతనిది మంచి ఫ్యామిలీ. ఆయన చాలా స్పోర్టివ్‌ పర్సన్‌. మామూలుగా పరిశ్రమలో మిగిలిన వాళ్లు ఎక్కువగా పక్కవాళ్ల దగ్గరికి మందు పార్టీలకు వెళ్తుంటారు. కానీ పూరీని ఎవరైనా పిలిస్తే ఆయనే ఎదురుపిలిచి, 'రండయ్యా! సరదాగా ఇక్కడే కూర్చుందాం' అని అంటారు. 
 
అలాగే, టోటల్‌గా సినిమా రంగానికి చెందిన పది మందో, పదిహేను మందో మాత్రమే డ్రగ్స్‌లో ఇన్వాల్వ్‌ అయి ఉంటే రాష్ట్రం ఇంత ఉలిక్కిపడదు. డ్రగ్స్‌ మహమ్మారి అత్యంత దారుణంగా వ్యాపించిందని తెలుసుకున్నారు కాబట్టే, గవర్నమెంట్‌ ఇంత ఫోకస్‌ ఫెట్టింది. డిపార్ట్‌మెంట్‌ వారి పనితీరు చూసి ఈ మధ్య నేను కూడా షాక్‌ అయ్యా. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే ఏదైనా మాట్లాడగలం. 
 
ఇకపోతే.. నేను పార్టీలకు చాలా మేరకు దూరంగా ఉంటాను. ఒకవేళ వెళ్లినా గంటో, అరగంటో ఉండి వచ్చేస్తాను. రాత్రి పదకొండైతే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఒకవేళ పూరీ వాళ్ల దగ్గరకు సరదాగా ఏ మందు పార్టీకో వెళ్లినా రెండో పెగ్‌ అయిన తర్వాత అక్కడే సోఫాలో పడుకుని నిద్రపోతాను. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా ఆడియో ఈవెంట్‌ కూడా నాకు తెలిసి కెల్విన్‌ చేయలేదని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

పహల్గామ్ ఉగ్రదాడి: పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం, జీవనోపాధి కోల్పోయిన వేలమంది

గాజాలో వైమానికదాడి.. 22 మంది చిన్నారులతో సహా 48 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments