Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేటింగ్స్ కోసం మీడియా నా జీవితాన్ని నాశనం చేసింది: పూరీ జగన్నాథ్ (Video)

రేటింగ్స్ కోసం మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందనీ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వాపోయారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Webdunia
గురువారం, 20 జులై 2017 (08:44 IST)
రేటింగ్స్ కోసం మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందనీ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వాపోయారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సిట్ బృందం ఎదుట పూరీ హాజరయ్యారు. మొత్తం 11 గంటల పాటుసాగిన విచారణ అనంతరం పూరీని సిట్ బృందం అధికారులు వదిలిపెట్టారు. 
 
అనంతరం పూరీ జగన్నాథ్ తన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పూరీ పలు విషయాలను చెప్పుకొచ్చారు. సిట్ విచారణకు వెళ్లానని, వారికి పూర్తిగా సహకరించానని చెప్పుకొచ్చారు. సమాజంలో తానెంతో బాధ్యత కలిగిన వ్యక్తినని, పోలీసులు, మీడియా అంటే తనకెంతో ఇష్టమని పూరీ వెల్లడించారు. పోలీసులపై తాను ఎన్నో సినిమాలు తీశానని, జర్నలిస్టుల కోసం ఇజం సినిమా తీశానని చెప్పారు.
 
కానీ, మీడియా తన విషయంలో ప్రవర్తించిన తీరు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. మీడియా రేటింగ్స్ కోసం కట్టు కథలు అల్లి ప్రోగ్రామ్స్ చేసిందని.. వాటి వల్ల తన కుటుంబం బాధతో కుమిలిపోతోందని వాపోయారు. ఈ విషయంలో తాను కూడా ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు. నిజంగా చెప్పాలంటే మీడియా జీవితాలను నాశనం చేసిందని పూరీ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా చేసిన పని వల్ల తాను మాత్రమే కాదని, ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని పూరీ చెప్పుకొచ్చారు. 
 
పైగా, తప్పుడు పనులను తాను ప్రోత్సహించనని పూరీ జగన్నాథ్ అన్నారు. కెల్విన్‌ గ్యాంగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నాపై ఉన్న ఆరోపణలకు సరైన సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. సిట్‌ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని పూరీ జగన్నాథ్ తెలిపారు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments