Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాస్టింగ్ కౌచ్‌పై పునర్నవి కామెంట్స్.. రాహుల్‌పై అలిగిందట.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (10:52 IST)
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ 3 తెలుగు పార్టిసిపెంట్ పునర్నవి భూపాలం సినిమా పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ వుందనే విషయాన్ని పునర్నవి అంగీకరించింది.  సినిమాల్లో నటించడానికి నిరాశగా ఉన్న బాలికలను, మహిళలను.. దర్శకులు, నిర్మాతలు దోపిడీ చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించింది.

అయితే, మునుపటి సంవత్సరాలతో పోల్చితే కాస్టింగ్ కౌచ్ బాగా తగ్గిందని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు, విద్యావంతులైన బాలికలు, మహిళలు సినిమాల్లో పాత్రలు పోషించడానికి ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇంకా వారికి ప్రత్యామ్నాయ వృత్తిని కలిగి ఉన్నందున వారు కాస్టింగ్ కౌచ్ ప్రతిపాదనలను ధైర్యంగా తిరస్కరించారని పునర్నవి చెప్పింది. 
 
బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్నవారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్‌, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఐతే వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. అంతేకాదు కలిసి తిరగడం.. ఎక్కడికెళ్లినా కలిసే కనిపించడంతో నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఎక్కువైపోయాయి. 
 
పైగా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని  ప్రచారం కూడా జరిగింది. ఈ మధ్య పునర్నవి  ఒక చిన్న విరామం  అనే సినిమా చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌తోనే బిజీగా ఉంది. ఇక సినిమాలు చాలు.. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని పున్ను ఆలోచిస్తుందంటూ వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం పునర్నవి.. రాహుల్‌పై అలిగినట్టు సమాచారం. 
 
ఈ మద్య కాలంలో పునర్నవి.. రాహుల్ ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ అవ్వడం లేదట. ఆ తర్వాత కాల్ బ్యాక్ చేయడం లేదు. కనీసం మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం లేదని చెప్పి తన సన్నిహితులతో బాధ పడిందట పునర్నవి.  కొన్ని రోజులుగా రాహుల్ నుండి రెస్పాండ్ రాకపోవడంతో అతడికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం రాహుల్ చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన పున్నుకు రిప్లై ఇవ్వలేక పోవచ్చు అంటూ సన్నిహితులు, అభిమానులు చెబుతున్నా ఆమె మాత్రం రాహుల్‌పై అలిగిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments