Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కా కమర్షియల్ సినిమా ఓటిటిలో అంత త్వరగా రాదు- అల్లుఅర‌వింద్

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (16:22 IST)
Allu Aravind, Gopichand, Rashikhanna, Maruti and others
గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో `పక్కా కమర్షియల్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో భాగంగా ఈ మూవీ టీం ప్రెస్ మీట్ ను నిర్వహించింది.  ఈ కార్యాక్రమంలో హీరో గోపిచంద్, హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు మారుతి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు తో పాటు ప్రముఖులు హాజరయ్యారు.
 
హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ తెలుగులో నా సినిమా రిలీజై చాలా రోజులు అయింది, మారుతి గారు ఏంజిల్ ఆర్నా కంటే చాలా చాలా మంచి కేరక్టర్ రాసారు. సినిమాలో చాలా మంచి  సీన్స్  ఉన్నాయ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. గోపీచంద్ గారితో మూడు సినిమాలకి వర్క్ చేశాను చాలా హ్యాపీ గా ఉంది.
 
దర్శకుడు మారుతి మాట్లాడుతూ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మొదటి కారణం యు.వి క్రియేషన్స్ వంశీ. నా నుంచి ఎటువంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో వాటితో పాటు అన్ని మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమాలా ఉంటుందని హామీ ఇచ్చారు.
 
"పక్కా కమర్షియల్" సినిమా ఓటిటిలో అంత త్వరగా రాదు, f3 సినిమా ప్రస్తుతం బాగా ఆడుతుంది, దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా ఉండబోతుందని మెగా నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.
 
గోపిచంద్ మాట్లాడుతూ..నేను ఈ సినిమా చెయ్యడానికి  కారణం వంశీ, జిల్ తరువాత ఎప్పటినుంచో సినిమా చెయ్యాలనుకున్నాం కానీ మంచి కథ దొరకలేదు. కథ బాగా నచ్చడంతో, చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాం. మారుతి తో షూటింగ్ స్టార్ట్ అవ్వగానే మాకు వేవ్ లెన్త్ బాగా కుదిరింది. ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments