Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫహాద్ ఫాజిల్‌కు బర్త్ డే లుక్ విడుద‌ల‌చేసిన పుష్ప యూనిట్‌

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (19:48 IST)
Fahad Fazil
అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప వస్తుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మొన్నటికి మొన్న విడుదలైన తొలి పాటకు సంబంధించిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
 
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఫ‌హాద్ న‌టించిన ప‌లు మ‌ళ‌యాలీ చిత్రాలు తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానుల ఆద‌ర‌ణ దక్కించుకున్నాయి. ఆగస్ట్ 8న ఈయన పుట్టిన రోజు. ఫహాద్ జన్మదినం సందర్భంగా పుష్ప చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్ విడుదల చేసారు. EVIL WAS NEVER SO DANGEROUS అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. దీన్ని బట్టి ఫహాద్ పాత్రను సుకుమార్ ఎలా డిజైన్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఫహాద్ ఫాజిల్ కన్ను హైలైట్ చేస్తున్న ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా పుష్ప 1 విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

రఘురామకృష్ణంరాజు కేసు.. రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ అరెస్ట్.. ఇవన్నీ జరిగాయా?

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments