Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏంటి చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా..? అక్కర్లేదు బండెక్కు'...

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (10:33 IST)
ఏంటి చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా.. అక్కర్లేదు బండెక్కు... ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్. అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమాకి 'భీమ్లా నాయక్'గా టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేసింది. 
 
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాకి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. 
 
ఇందులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్ర పేరు 'భీమ్లా నాయక్'. ఆయన సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా, రానాకి జంటగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.
 
'లాలా, భీమ్లా, అడవిపులి, గొడవపడే, ఒడిసికొట్టు' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తుండగా.. 'హే డానీ.. బయటికి రారా నా.. కొ**కా' అంటూ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. లుంగీలో ఆయన కనిపించిన తీరు ఫ్యాన్స్‌కి పండగే. 
 
ఇక లాస్ట్‌లో రానా తనని డానీ, డానియల్ శేఖర్ అని పరిచయం చేసుకోగా.. భీమ్లా.. భీమ్లా నాయక్ అని పవన్ తన పేరు చెప్పారు. ‘ఏంటి చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా..? అక్కర్లేదు బండెక్కు..’ అంటూ పవన్ చెప్పిన తీరు ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయ్. 
 
యాక్షన్ సీన్‌తో, పవర్ ఫుల్ డైలాగ్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తోంది. ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. 

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments