Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (09:18 IST)
సినీ దర్శకుడు శంకర్‌తో తమకున్న అనుభవాన్ని బడా నిర్మాత దిల్ రాజు తాజాగా వెల్లడించారు. హీరో అర్జున్ నటించిన 'ఒకే ఒక్కడు' చిత్రం నుంచి మా జర్నీ ప్రారంభమైందన్నారు. నాడు దర్శకుడు శంకర్, చంద్రబాబుల చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ తీసుకున్నట్టు చెప్పారు. అలాగే, శంకర్ నిర్మించిన "వైశాలి" చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసినట్టు చెప్పారు. అప్పటి నుంచి శంకర్‌తో జర్నీ చేస్తున్నామని, ఇపుడు "గేమ్ ఛేంజర్‌"ను నిర్మించినట్టు చెప్పారు. 
 
తాజాగా డల్లాస్‌లో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు పాల్గొని మాట్లాడుతూ, శంకర్‌ మాతో సినిమా చేయాలని, తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారని మా కో- డైరెక్టర్ గారి ద్వారా తెలిసింది. రామ్ చరణ్ అప్పుడు 'ఆర్ఆర్ఆర్' షూటింగులో ఉన్నారు. అప్పుడు ఈ కథ ఆయనకు చెప్పడం, నచ్చడం అలా జర్నీ మొదలైంది. మా బ్యానరులో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్‌తో నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది.
 
డోప్ సాంగ్‌ను ముందుగా నేను ఫోన్ చూశా. ఈ పాటను డల్లాస్‌లో రిలీజ్ చేస్తున్నామని తెలిసి నాకు సంతోషం వేసింది. ఈ పాటను చూసినప్పుడు నాకు కంట్లోంచి ఆనందబాష్పాలు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది.
 
నేను చిరంజీవి చిత్రాలను ఒక ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేశా. కానీ 'తొలిప్రేమ' సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంజాయ్ చేశాను. కళ్యాణ్‌తో సినిమా తీయడానికి నాకు చాలా టైం పట్టింది. మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్‌తో 'ఎవడు' చేశాం. అది రిలీజై 11 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు 'గేమ్ చేంజర్'తో మళ్లీ సంక్రాంతికి రాబోతోంది. ఈ సారి మామూలుగా కొట్టడం లేదు. గట్టిగా కొట్టబోతోన్నాం అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments