Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి, మ‌హేష్‌బాబు సినిమా గురించి నిర్మాత వివ‌ర‌ణ‌

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (20:39 IST)
Rajamouli- mahesh
రాజ‌మౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా ముందుకు వ‌స్తాడు. కానీ ఆయ‌న కోసం డేట్స్ ఎక్కువ ఇవ్వాల్సి వుంటుంది. ఎప్ప‌టికీ పూర్త‌వుతుందో ఇప్ప‌టి ప‌రిస్థితిలో తెలీదు. కాగా, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌బాబు హీరోగా సినిమా చేయాల‌నేది ఎప్ప‌టినుంచో నిర్మాత కె.ఎల్ .నారాయ‌ణ కోరిక‌. ఇద్ద‌రూ పెద్ద‌గా బిజీగా లేని టైంలో ఆయ‌న‌కు మాట ఇచ్చార‌ట‌. ఈ సినిమాపై గ‌తంలో కొద్దిరోజులు చ‌ర్చ కూడా జ‌రిగింది. ఆఫ్రికన్ అడవిలో తీసే యాక్ష‌న్ చిత్రంగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌పై ఇటీవ‌లే నిర్మాత కె.ఎల్. నారాయణ వెబ్ పోర్టల్‌తో మాట్లాడారు. అందులో ప‌లు విష‌యాల్లో ఇదొక‌టి.
 
ఆ సినిమాపై ఆయ‌న మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు ఏమీ ఖరారు కాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి, మహేష్ ఇద్దరూ నాతో పనిచేయడానికి కట్టుబడి ఉన్నారు. ఆ త‌ర్వాత వారి మార్కెట్ విపరీతంగా పెరిగింది. అయినా వారు వాగ్దానం చేసిన దానికి నిలబడ్డారు. కథాంశం గురించి బ‌య‌ట వార్త‌లు వ‌స్తున్నాయి. కాని వాస్తవానికి ఇది ఇంకా పనిలో ఉంది. రాజమౌలి అతని బృందం ఇప్పటికే స్క్రిప్ట్ కోసం పనిచేయడం ప్రారంభించింది. క‌థ‌ సిద్ధంగా ఉన్నప్పుడు న‌న్ను పిలుస్తారు. అప్పుడు క్లారిటీ ఇస్తాన‌ని` తెలిపారు.
 
కాగా, మ‌హేష్ ఇప్పుడు స‌ర్కారువారిపాట‌తోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా కూడా వుంది. రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప‌నిలో వున్నారు. మ‌రి ఈ సినిమా ఏ స్థాయిలో వెళుతుందో తెలీదు. ఆ త‌ర్వాత అన్నీ అనుకూలిస్తే కె.ఎల్‌. నారాయ‌ణ సినిమా వుంటుంద‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments