Webdunia - Bharat's app for daily news and videos

Install App

కె దశరధ్ నిర్మించిన లవ్ యూ రామ్ జూన్ 30న విడుదల

K Dasharath   DY Chaudhary  Rohit Behal  Aparna Janardhanan
Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (16:44 IST)
K Dasharath, DY Chaudhary, Rohit Behal, Aparna Janardhanan
సక్సెస్ ఫుల్  డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్‌ కి మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను మేకర్స్ లాంచ్ చేశారు
 
అపర్ణకు రోహిత్ తన ప్రేమను ప్రపోజ్ చేయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అయితే రామ్ మాత్రం ‘రాముడు మంచి బాలుడు’ టైపు కాదు. అతను చాలా స్వార్థపరుడు, చాలా మంది అమ్మాయిల ఎమోషన్ తో  ఆడుకుంటాడు. అపర్ణతో ప్రేమ ప్రయాణంలో రామ్ మంచి వ్యక్తిగా మారతాడా? అనేది కథాంశం.
 
కె దశరధ్ అందించిన కథ ఈ తరం యువతకు బాగా నచ్చుతుంది. డివై చౌదరి సబ్జెక్ట్‌ ని అద్భుతంగా హ్యాండిల్ చేసారు. డైలాగ్స్ కూడా చాలా ఇంపాక్ట్‌ గా ఉన్నాయి. రోహిత్ బెహల్ ప్లజంట్ గా కనిపించాడు. అపర్ణ జనార్దనన్ ట్రెడిషనల్ లుక్‌ లో ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ సాయి సంతోష్ ,  సంగీత దర్శకుడు కె వేద బ్రిలియంట్ . ఈ చిత్రానికి ఎస్‌బి ఉద్ధవ్ ఎడిటర్, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కె దశరధ్ మాట్లాడుతూ.. జూన్ 30న లవ్ యూ రామ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. మైత్రీ మూవీస్ వారి ద్వారా విడుదల చేస్తున్నాం  లవ్ యూ రామ్ చాలా మంచి ఎంటర్ టైనర్. మ్యూజిక్, కథ అన్నీ బావుంటాయి. అందరూ థియేటర్ లో చూడాలి’’ అని కోరారు.
 
డివై చౌదరి మాట్లాడుతూ.. అందరికీ నచ్చేలా సినిమా వచ్చింది.  ఇప్పటివరకూ చూసిన వారందరూ హ్యాపీగా ఫీలయ్యారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా  లో  ట్రెండ్ అవుతుంది.  జూన్ 30న సినిమాని థియేటర్ లో చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు
 
హీరో రోహిత్ మాట్లాడుతూ.. లవ్ యూ రామ్ జూన్ 30న విడుదలౌతుంది. ఇది మాకు చాలా స్పెషల్ మూమెంట్. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా గ్రేట్ జర్నీ. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’’ అన్నారు
 
అపర్ణ మాట్లాడుతూ.. చాలా ఆనందంగా వుంది. ఇప్పటి వరకూ చాలా సపోర్ట్ దొరికింది. ఇంకా మీ సపోర్ట్ కావాలి. ఈ సినిమా కంప్లీట్ ప్యాకేజ్. మీ అందరికీ నచ్చుతుంది. నేను, రోహిత్ ఇండస్ట్రీకి కొత్త. మీ అందరి ప్రేమ, ప్రోత్సాహం కావాలి’’ అని కోరారు.
 
సుధాకర్ బొర్రా (టేనస్సీ) ,  డి నాగేశ్వర్ రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గోపు,  శివ మొక్క స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ వర్మ డైలాగ్స్ రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments