Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వ‌నీద‌త్ మాట‌ల‌కు నిర్మాత‌ల గిల్డ్ క‌ల‌వ‌రం

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (18:04 IST)
చాలాకాలంపాటు మీడియాకు దూరంగా వుండి త్వ‌ర‌లో త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం మీడియా ముందుకు వ‌చ్చారు సి. అశ్వ‌నీద‌త్. దాంతో కుటుంబంతో మాట్లాడిన‌ట్లు సినిమారంగంలో ప‌లు పోక‌డ‌ల గురించి తెలియ‌జేశారు. అందులో భాగంగా టికెట్ల పెంచ‌మ‌ని సి.ఎం.ను క‌ల‌వ‌డం వ‌ల్లే ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. మ‌ళ్ళీ వారే టికెట్ల త‌గ్గిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యంగానూ వుంది అన్నారు. అస‌లు గిల్డ్ అనేది ఎందుకు పుట్టిందో త‌న‌కు తెలీద‌ని, త‌న కుమార్తె స్వ‌ప్న‌ను కూడా అగిగాను. త‌ను ఏదో చెప్పింది అన్న‌ట్లుగా చెప్పారు. అస‌లు నిర్మాత‌ల‌మండ‌లి ఎలా ఉద్భ‌వించిందో.. దాని వెనుక ఎవ‌రి కృషి వుందో తెలియ‌జేశారు. కానీ ఇప్పుడు వారంతా దూరంగా వున్నారు. దాంతో కొత్త‌త‌రం నిర్మాత‌లుగా ముందుకు వ‌చ్చారు.
 
ఇక ఇప్ప‌టి ట్రెండ్‌లో దిల్‌రాజుతోపాటు ప‌లువురు సినిమాలు నిర్మిస్తున్నారు. వారిలో కొంత‌మండి నిర్మాత‌ల గిల్డ్ ఏర్పాటు చేశారు. ఇక సి. అశ్వ‌నీద‌త్ మాట్లాడిన మాట‌ల‌కు నిర్మాత‌లు ఖంగు తిన్నారు. దాంతో వారు ఆయ‌న‌పై ఒత్తిడి చేసిన‌ట్లు తెలిసింది. ఆ ప‌ర్యావ‌సాన‌మే నేడు ఓ లెట‌ర్ విడుద‌ల చేసిన‌ట్లు ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తోంది. 
 
నిర్మాత‌ల నిర్ణ‌య‌మే.... నా నిర్ణ‌యం
 
''యాభై ఏళ్లుగా చిత్ర‌సీమ‌లో నిర్మాత‌గా కొన‌సాగుతున్నా. నా తోటి నిర్మాత‌లంద‌రితోనూ చాలా స‌న్నిహితంగా, సోద‌ర భావంగా మెలిగాను. ఏ నిర్మాత‌పైనా నాకు అగౌర‌వం లేదు. గిల్డ్ అయినా, కౌన్సిల్ అయినా... నిర్మాత‌లు, చిత్ర‌సీమ శ్రేయ‌స్సు కోస‌మే ఉద్భ‌వించాయి. ప‌రిశ్ర‌మ కోసం అంద‌రూ ఒక్క తాటిపై న‌డిచి... మంచి నిర్ణ‌యాలు తీసుకొంటే బాగుంటుంద‌ని నా అభిప్రాయం.  నిర్మాత‌లంతా క‌లిసి... చిత్ర‌సీమ గురించి ఏ మంచి నిర్ణ‌యం తీసుకొన్నా నా సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఉంటుంది.
- సి. అశ్వ‌నీద‌త్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

ఎంపీ విజయసాయిరెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చేయాలి.. నారా లోకేష్‌కు విజ్ఞప్తి (video)

విష వాయువు పీల్చి... జార్జియాలో 12 మంది మృతి

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు విరుద్ధం : కాంగ్రెస్

జమిలి ఎన్నికల బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments