Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రాపై రిగ్గింగ్ ఆరోపణలు... ఎలా గెలుచుకోగలిగింది..? (video)

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (14:58 IST)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై రిగ్గింగ్ ఆరోపణలు వచ్చాయి. 2000 సంవత్సరంలో జరిగిన మిస్ వరల్డ్‌ పోటీల్లో ప్రియాంక చోప్రా రిగ్గింగ్ చేసి ఆ పోటీలో విజేతగా నిలిచిందని మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ ఆరోపణలు గుప్పించింది. 
 
22 ఏళ్ల తర్వాత లీలానీ మెక్ కానీ ఇలా ఆరోపణలు చేయడానికి కారణం ఇటీవల జరిగిన మిస్ యూఎస్ఏ 2022 పోటీలు కావడం గమనార్హం. ఈ పోటీలో రిగ్గింగ్ జరిగిందని వార్తలు రావడంతో.. 2000 నాటి ఘటనని లీలానీ మెక్‌కానీ తెరపైకి తీసుకొచ్చింది. మిస్ యుఎస్‌ఏ 2022 గాబ్రియేల్‌ విజేతగా నిలిచింది.
 
అప్పట్లో ప్రియాంక చోప్రా ఓ కాంపిటేషన్‌లో మేము అంతా ఒక టైప్ స్విమ్ సూట్ వేసుకుంటే.. తను వేరే టైప్ స్విమ్ సూట్ వేసుకునేది. అయినా.. జడ్డిలు ఆమెకి అభ్యంతరం చెప్పలేదు. అలానే డిజైనర్ కూడా ప్రియాంకకి సపరేట్‌గా ఫ్రాక్స్ డిజైన్ చేశాడు. అన్నింటికీ మించి 1999లో ప్రియాంక చోప్రా మిస్ ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ.. ఏడాదిలోపే మిస్ వరల్డ్‌ని ఎలా గెలుచుకోగలిగింది? రిగ్గింగ్ చేసి ఆమెని విజేతగా నిలిపారని చెప్పుకొచ్చింది.
 
లీలానీ మెక్‌కానీ ఆరోపణలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 22 ఏళ్ల నుంచి ఎందుకు ఈ విషయంపై స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఏమాత్రం స్పందించలేదు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments