Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ మేనల్లుడితో ప్రియాంక చోప్రా: బేవాచ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ప్రియాంక బిజీ బిజీ!

బాలీవుడ్ అందాల తార, హాలీవుడ్ క్వాంటికో సీరియల్ నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మేనల్లుడిని ఎత్తుకుని ఆడించింది.

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (17:37 IST)
బాలీవుడ్ అందాల తార, హాలీవుడ్ క్వాంటికో సీరియల్ నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మేనల్లుడిని ఎత్తుకుని ఆడించింది. ముంబైలోని మెహబూబా స్టూడియోకు అర్పితా ఖాన్ తన బిడ్డతో సహా స్టూడియోకు వచ్చింది. ఈ సందర్భంగా మూడు నెలలైన అహిల్‌ను ఎత్తుకుని ముద్దాడింది. ఇలా ప్రియాంక-అహిల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
కాగా ప్రియాంక హాలీవుడ్ మూవీ బేవాచ్‌లోనూ, క్వాంటికో అనే సీరియల్‌లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లతో బిజీ అయిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడే బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చింది. అనుకోకుండా మెహబూబ్ స్టూడియోలో ప్రియాంకకు, అహిల్ ఇద్దరూ ఎదురయ్యారు. దీంతో మూడు నెలలున్న బిడ్డను ఎత్తుకుని ఆటాడించింది. ఇంకా ఓ లవ్లీ బాయ్‌ను మీట్ చేశానంటూ ట్వీట్ చేసింది. 
 
ఇకపోతే.. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమా బేవాచ్ పోస్టర్ సోమవారం (జూలై-4)న రిలీజైన సంగతి తెలిసిందే. కాగా బేవాచ్ బిగ్ స్క్రీన్ స్టోరీ 1990లో పాపులర్ టీవీ డ్రామాకు చెందింది. ఈ సినిమాకు సేత్ గోర్డన్ దర్శకత్వం వహిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments