Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్ హౌస్ విందు: బరాక్ ఒబామా-మిషెల్ దంపతులతో ప్రియాంక చోప్రా..!

Webdunia
ఆదివారం, 1 మే 2016 (17:14 IST)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు అమెరికా అధినేత బరాక్ ఒబామా విందు ఇచ్చారు. తన పదవీ కాలంలో ఒబామా ఇచ్చిన చివరి కరస్పాండెంట్స్ డిన్నర్ ఇదే కావడం గమనార్హం. క్వాంటికో సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా 1990లో సూపర్ హిట్ అయిన టీవీ సిరీస్ బేవాచ్ ఆధారంగా సాగే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో జరిగిన కరెస్పాండెంట్స్ డిన్నర్లో ప్రియాంక చోప్రా పాల్గొంది. ఒబామా సతీమణీ మిషెల్ కూడా ఈ విందులు పాల్గొన్నారు.  డిన్నర్ పూర్తయ్యాక ప్రియాంక ఒబామా దంపతులతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బయటపెట్టారు. 
 
ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రియాంక చోప్రా ట్వీట్ చేస్తూ.. ఒబామా, మిషెల్లీతో కలిసి డిన్నర్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. 2016 వైట్ హౌస్ కరెస్పాండెట్స్ నిర్వహించిన విందుకు ప్రియాంకను ఇటీవల ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. కాగా ఒబామా ఇచ్చిన కరస్పాండెంట్స్ విందులో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ మెంబర్స్, రిపోర్టర్లు, నిర్మాతలు, కెమెరా ఆపరేటర్లు, జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments