Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియమణి డాక్టర్ 56 మోషన్ పోస్టర్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (15:32 IST)
Doctor 56 Motion Poster
ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే ప్రియమణి ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రియమణి ప్రస్తుతం డాక్టర్ 56 అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ మీద అందిస్తున్నారు. ఇది వరకే ఈ బ్యానర్ మీద మంచి చిత్రాలు  తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  ప్రభుదేవా ఫ్లాష్ బ్యాక్, వర ఐపీఎస్, ఛేజింగ్ వంటి చిత్రాలు కూడా ఈ బ్యానర్ మీద రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి.
 
ప్రస్తుతం ప్రియమణి నటించిన డాక్టర్ 56 అనే ఈ సినిమాకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చి ప్రమోషన్ చేయడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. దీంతో పాటుగా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
 
ఇందులో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ అలా సస్పెన్స్‌గా వదిలేశారు. మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.
 
ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా.. రాజేష్‌ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ మీద ఈ సినిమాను ప్రవీణ్‌ రెడ్డి. టి నిర్మిస్తున్నారు.  నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్‌గా, రాకేష్ సి తిలక్ కెమెరామెన్‌గా, విశ్వ ఎన్ ఎమ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మాటలు భార్గవ్ రామ్ అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని చల్లా భాగ్యలక్ష్మీ , జె లక్ష్మణ్ అందించారు. 
 
ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్‌ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టుకు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ఎప్పుడొస్తుందా చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: అంబటి రాంబాబు (video)

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments