Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియమణి డాక్టర్ 56 ఫస్ట్ లుక్

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (15:55 IST)
Priyamani Doctor 56 First Look
ప్రియమణి ప్రస్తుతం డాక్టర్ 56 అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ మీద అందిస్తున్నారు. ఇది వరకే ఈ బ్యానర్ మీద మంచి చిత్రాలు  తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  ప్రభుదేవా ఫ్లాష్ బ్యాక్, వర ఐపీఎస్, ఛేజింగ్ వంటి చిత్రాలు కూడా ఈ బ్యానర్ మీద రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి.
 
ప్రస్తుతం ప్రియమణి నటించిన డాక్టర్ 56 అనే సినిమాకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీద రిలీజ్ చేశారు .  ఈ సినిమాను సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
 
ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా.. రాజేష్‌ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ మీద ఈ సినిమాను ప్రవీణ్‌ రెడ్డి. టి నిర్మిస్తున్నారు.  నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్‌గా, రాకేష్ సి తిలక్ కెమెరామెన్‌గా, విశ్వ ఎన్ ఎమ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మాటలు భార్గవ్ రామ్ అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని  డా . చల్లా భాగ్యలక్ష్మీ , జె లక్ష్మణ్ అందించారు. 
 
ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్‌ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments