Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టాదశ శక్తి పీఠాల నేపథ్యంతో స‌ర్వం శ‌క్తిమ‌యం

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (19:02 IST)
Priyamani, bvs ravi and others
ప్రియమణి, సంజయ్ సూరి మెయిన్ లీడ్‌గా ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కు బీవీఎస్ రవి కథను అందించారు. అంకిత్, వినయ్ చద్దా, కౌముది కే నేమని ఈ వెబ్ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించారు.ఆహాలో ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి తిరుగుతుంది. ఓ శ్రీమంతుడు తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తంగా పది ఎసిసోడ్‌లు ఉంటాయి. ఇక ఈ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం జరుగుతుంది.

రైట‌ర్ బీవీఎస్ ర‌వి మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారు, క‌ళ్యాణ్ కృష్ణ‌, ఐఏఎస్ ఆఫీస‌ర్ జ‌యేష్ రంజ‌న్‌గారు, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిగారు అందించిన స‌పోర్ట్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే వారి వ‌ల్లే మేం 18 శ‌క్తిపీఠాల గ‌ర్భ‌గుడిలో మేం షూటింగ్ చేసుకునే అవ‌కాశం క‌లిగింది. అందుకు వారికి ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాలు. ఈ సిరీస్ చేయ‌టానికి ముందు నేను అమ్మ‌వారి గురించి చాలా పుస్త‌కాలు చ‌దివాను. అయితే జీవితంలో కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న‌ప్పుడు దేవుడి వైపుకో, న‌మ్మ‌కాల వైపుకో మ‌నం వెళ్లిపోతాం. ఓసారి దుర్గ అమ్మవారిని పూజించాల‌ని ఒక మిత్రుడు స‌ల‌హా ఇచ్చాడు. అద‌లా ఉన్నప్పుడు ఓ రోజు ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ అస్సాం కామాఖ్య నుంచి ఫోన్ చేసి త‌ప్ప‌కుండా వ‌చ్చి చూడు అని అన్నాడు. నేను వెళ్ల‌లేక‌పోయాను. త‌ను అక్క‌డి నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఇదే కాదు..

అష్టాద‌శ పీఠాల‌ను చూడాల‌ని ప‌ట్టుబట్టాడు. దీనిపై సాంగ్ చేయాల‌ని కూడా అన్న‌ప్పుడు అస‌లు అలా ఫొటోలు, వీడియోలు చేస్తే ఎవ‌రు చూస్తార‌ని అనుకుంటున్న‌ప్పుడు విజ‌య్ చాడాగారు నాకు ఫోన్ చేశారు. ఆయ‌న వ‌ల్ల‌నే స‌ర్వం శ‌క్తిమ‌యం సిరీస్ రూపొందింది. ఆయ‌న ఫోన్ చేసి ఇలా అష్టాద‌శ శ‌క్తిపీఠాల గురించి తెలుసా అని అన్నాడు. కొంచెం తెలుసు అని అన్నాను. అప్పుడాయ‌న‌. దీనిపై మ‌నం వెబ్ సిరీస్ చేయాల‌ని చెప్పి బెంగుళూరుకి పిలిచారు. 18 శ‌క్తి పీఠాల‌ను ద‌ర్శించ‌టం సాధార‌ణ విష‌యం కాదు. ఇంత టెక్నాల‌జీ ఉన్నప్పుడు దీన్ని అంద‌రికీ చూపించాల‌ని అన్నారు. అలాగే  సాధార‌ణంగా చూపిస్తే ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా చూడ‌రు కాబ‌ట్టి దీనికొక క‌థ ఉండాలి. ప‌ది కాలాల పాటు నిలిచిపోయేలా ఉండే ధ‌ర్మం గురించి చెప్పాల‌ని అన్నారు. న్యాయం, చ‌ట్టం మారుతుందేమో కానీ ధ‌ర్మం మార‌దు. కాబ‌ట్టి దాని గురించి ఇందులో చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఓ నాస్తికుడు దేవుడు లేడ‌ని నిరూపించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు పామ‌రుడు నుంచి విజ్ఞాని వ‌ర‌కు ధ‌ర్మం గురించే చెబుతారు. ప‌నిని పూజిస్తే దేవుడ్ని పూజించ‌టం కంటే గొప్ప‌ద‌ని చెప్పే ధ‌ర్మం క‌థే స‌ర్వం శ‌క్తిమ‌యం. హేమంత్ మ‌ధుక‌ర్ లేక‌పోతే ఇది పూర్తయ్యేది కాదు. ప్ర‌దీప్ ఎంతో గొప్ప ద‌ర్శ‌కుడు కాబోతున్నారు. సిరాశ్రీగారికి థాంక్స్‌. అక్టోబ‌ర్ 20న స‌ర్వం శ‌క్తిమ‌యం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది’’ అన్నారు.
<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments