Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారంగపాణిలో ప్రణయ గీతంలో అలరిస్తున్న ప్రియదర్శి, రూపా కొడువాయుర్

డీవీ
శనివారం, 26 అక్టోబరు 2024 (18:07 IST)
Priyadarshi, Rupa Koduvayur dance
శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సారంగపాణి జాతకం'. ప్రియదర్శి, రూపా కొడువాయుర్ ఇందులో జంటగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ తరువాత శ్రీదేవి మూవీస్ - మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. 
 
ఇందులో మొదటి పాట 'సారంగో సారంగా' ని నేడు ఆదిత్య మ్యూజిక్ ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేశారు. విడుదలైన కాసేపట్లోనే వీక్షకులని, శ్రోతల్ని అమితంగా ఆకట్టుకోవడంతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
 
ఈ పాట గురించి దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ "ఈ సినిమాలో కథానాయకుడు ప్రియదర్శి పేరు సారంగపాణి.  అతని ప్రేమకథ నేపథ్యంలో వచ్చే పాట ఇది. ఓ రకంగా ఆ ప్రేమ కథకి మూలాధారం ఈ పాటే . నిత్యజీవితంలో తనకి తారసపడే వారితో సారంగపాణి తన ప్రేమని ఎలా ఆవిష్కరించాడో అన్నదే ఈ పాటలో ప్రధానం. హైదరాబాద్ లోని విభిన్న ప్రదేశాల్లో ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ లపై వినూత్నంగా చిత్రీకరించాం. 
 సారంగో సారంగా 
ఆనందాలందుకో అనేకంగా..” అంటూ సాగే ఈ పాట అర్మాన్ మాలిక్ గళంలో రామజోగయ్య శాస్త్రి పద చాతుర్యం కొత్త పుంతలు  తొక్కినట్టుగా అనిపిస్తుంది. వివేక్ సాగర్ హాయైన స్వరాలతో ఈ పాటని తీర్చిదిద్దారు. ఇక సినిమాలో సరికొత్త ప్రియదర్శిని చూడబోతున్నారు" అని తెలిపారు.
 
ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ , నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె.మణి, 'ఐమ్యాక్స్' వెంకట్ తదితరులు ఈ చిత్రం  ప్రధాన తారాగణం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments