Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

డీవీ
సోమవారం, 24 జూన్ 2024 (17:36 IST)
Priyadarshi Nabha Natesh
ఈ సంవత్సరం ప్రారంభంలో పాన్ ఇండియా సెన్సేషన్ 'హను-మాన్‌' అందించిన బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో “డార్లింగ్” టైటిల్ తో రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌తో వస్తోంది. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ రైటర్, డైరెక్టర్.
 
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
 
రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీతో మరో బ్లాక్‌బస్టర్‌ని స్కోర్ చేయడంపై మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్‌లో మోస్ట్ రిలేటేబుల్ కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం రెడీగా వుంది.
 
బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నరేష్ రామదురై  డీవోపీ వ్యవహరిస్తుండగా, హేమంత్ డైలాగ్స్ అందిస్తున్నారు, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ ఇ రాఘవ్ చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments